స్వింగ్ లో మోహన్ బాబు
ప్రతినాయకుడి పాత్రల నుంచి హీరో పాత్రల వైపు మళ్లి అక్కడకూడా సక్సెస్ అయిన డాక్టర్ మోహన్ బాబు ఇటీవల కాలంలో క్యారెక్టర్ పాత్రల వైపు మళ్లారు. ఇటీవల 'మేస్త్రి' చిత్రంలో మేజర్ దేవరాజ్ గా కేవలం 15 నిమిషాల పాటు స్క్రీన్ పై కనిపించి అలరించారు. శర్వానంద్ తో కలిసి నటిస్తున్న 'రాజు మహారాజు' చిత్రం మేలో విడుదలకు సిద్ధమవుతోంది. పనిలో పనిగా తన తనయుల చిత్రాల్లోనూ మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
'ఢీ' చిత్రంతో తొలి సక్సెస్ సాధించిన విష్ణువర్దన్ ఇప్పుడు 'సలీమ్' చిత్రం ద్వారా మళ్లీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఆ సినిమా ప్రోగ్రస్ ను దర్శకుడు వై.వి.ఎస్.చౌదర గుట్టుగా ఉంచుతున్నారు. ఇందులో మోహన్ బాబు విలన్ పాత్రను పోషిస్తున్నారు. చాలాకాలం తర్వాత ఆయన విలనీ పాత్ర పోషిస్తుండటం సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పాత్రను వై.వి.ఎస్.చౌదరి ప్రత్యేక శ్రద్ధతో తీర్దిదిద్దుతున్నారనీ, విష్ణు, మోహన్ బాబు పాత్రలు నువ్వా-నేనా అన్నట్టు పోటీగా ఉండబోతున్నాయనీ చెబుతున్నారు. ఆలాగే మంచు మనోజ్ గతంలో బాలనటుడిగా నటించినప్పటికీ హీరో అయిన తర్వాత ఇంతవరకూ సరైన సక్సెస్ చవిచూడలేదు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 'ప్రయాణం' చిత్రంపై మనోజ్ మంచి ఆశలే పెట్టుకున్నారు. దీని తర్వాత మనోజ్ కథానాయకుడుగా ఆయన సోదరి లక్ష్మీప్రసన్న ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా ఎంపికయ్యారు. వహించనున్నారు. ఆసక్తికరంగా ఇందులో మనోజ్ తో తొలిసారి మోహన్ బాబు కలిసి నటించబోతున్నట్టు సమాచారం. రాఘువేంద్రరావు, మోహన్ బాబు కాంబినేషన్ లో గతంలో పలు హిట్లు వచ్చాయి. దానికి తగ్గట్టే ఇప్పుడు మనోజ్ సినిమాలోని కీలక పాత్రను మోహన్ బాబుకు దర్శకేంద్రుడు ఆఫర్ చేసినట్టు తెలిసింది. సొంత బ్యానర్ కావడం, ఖర్చుకు వెనుకాడని తత్వం, అందులోనూ మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తుండచంతో ఈసారి విష్ణుతో పాటు మనోజ్ కూ సరైన హిట్లు దొరుకుతాయమో చూడాలి.
Be first to comment on this News / Article!
|