ఎన్టీఆర్ తో మళ్లీ ప్రియమణి
అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్ గా ప్రియమణి ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో తన సత్తా చాటుకుంటోంది. ఓవైపు ఎన్టీఆర్, నితిన్ వంటి యంగ్ హీరోలతో నటిస్తూనే సీనియర్ హీరోలకూ సరిజోడిగా అనిపించుకుంటోంది. నందమూరి ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించిన క్రెడిట్ ను కూడా ప్రియమణి ఇటీవల దక్కించుకుంది. ఎన్టీఆర్ తో 'యమదొంగ', కల్యాణ్ రామ్ తో 'హరేరామ్' చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇప్పుడు బాలకృష్ణ సరనస 'మిత్రుడు'లో నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందనేది మే 1న 'మిత్రుడు' రిలీజ్ తర్వాతే తేలుతోంది. ఆసక్తికరంగా నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా ప్రియమణి తాజాగా అందిపుచ్చుకుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్ ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో నటించేందుకు కమిట్ అయ్యారు. గతంలో దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన 'మున్నా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 'మున్నా' ఆశించన విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో వంశీ పైడిపల్లి ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు జోడిగా ప్రియమణిని ఎంపిక చేసినట్టు సమచారం. 'యమదొంగ' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత ఎన్టీఆర్-ప్రియమణి మలి కాంబినేషన్ ఇదే అవుతుంది. 'అదుర్స్' చిత్రం పూర్తయిన వెంటనే దిల్ రాజు చిత్రం మొదలవుతుంది.
Be first to comment on this News / Article!
|