బన్నీకి ఇద్దరు డైరెక్టర్లు?
అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి ఇద్దరు డైరెక్టర్లా? లేదా డైరెక్టర్ మారాడా? ఇలాంటి సందేహాలే గత ఒకటి రెండు రోజులుగా పలువురిలో వ్యక్తమయ్యాయి. చివరకు సదరు నిర్మాత జోక్యంతో సందేహ నివృత్తి జరిగింది. విషయానికి వస్తే...అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ('దేశముదురు' ఫేమ్) ఓ చిత్రాన్ని తీస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు విష్ణువర్దన్ ('బిల్లా' ఫేమ్) తాజాగా చెన్నైలో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెలుగులో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాననీ, దానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారనీ తెలిపారు. జూలైలో షూటింగ్ ఉంటుందని కూడా ప్రకటించారు. దీంతో సహజంగానే అల్లు అర్జున్ తో దానయ్య వెంటవెంటనే రెండు ప్రాజెక్టులు చేయడుతున్నారా? లేదా గుణశేఖర్ ను తప్పించి విష్ణువర్దన్ ను దర్శకుడిగా తీసుకున్నారా అనే అనుమానాలకు తావిచ్చినట్టయింది.
దీనిపై దానయ్యను వివరణ కోరినప్పుడు, విష్ణువర్దన్ ఏమి చెప్పారో కానీ ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ తో సినిమా తీయడం లేదని అన్నారు. అల్లు అర్జున్ తో గుణశేఖర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తీస్తున్నాననీ, ఆ సినిమా పూర్తి కాకుండానే మళ్లీ అదే హీరోతో సినిమా ఎందుకు తీయాలనుకుంటానని ఎదురు ప్రశ్నించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం 'ఆర్య-2', గుణశేఖర్ చిత్రాలకు కమిట్ అయ్యారు. వీటి తర్వాత తమ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ కు చేయనున్నారు. అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారు.
Be first to comment on this News / Article!
|