సుమంత్ పెళ్లి డిసెంబర్ లో
హీరో సుమంత్ ఎట్టకేలకు మనసు మార్చుకుని మళ్లీ పెళ్లికి సిద్ధపడుతున్నారు. వెండితెరపై ప్రేక్షకులను అలరించిన నటీనటులు తమ కంటూ వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం ఉండాలని కోరుకోవడం సహజం. అయితే వీటిలో కొన్ని పెళ్లిల్లు చివరి వరకూ నిలిస్తే, మరికొన్ని విడాకులతో చేదు అనుభవాన్ని మిగులుస్తుంటాయి. హీరో సుమంత్, సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నటి కీర్తిరెడ్డి కొద్దికాలం క్రితం ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. చైన్ రెస్టారెంట్ బిజినెస్ ల వైపు కెరీర్ ను మళ్లించమని కీర్తిరెడ్డి పట్టుబట్టిందనీ, నటనకు, తన కుటుంబ సభ్యులకూ దూరమై తెలియని వ్యాపారంలోకి దిగలేనని సుమంత్ తెగేసి చెప్పాడనీ, ఇక్కడే వారిధ్యరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి చివరకు విడాకులకు దారితీసిందనీ చెబుతారు.
ఈ పరిణాలు సంభవించి చాలాకాలమే అయినా సుమంత్ మళ్లీ పెళ్లికి విముఖత చూపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నటి కమలిని ముఖర్జీకి ఆయన దగ్గరయ్యారనీ, పెళ్లి చేసుకోనున్నారనీ కూడా వదంతులు వచ్చాయి. అయితే అవన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కెరీర్ పరంగా కూడా సుమంత్ ఇటీవల కొద్దిగా వెనకబడ్డారు. ఆయన సినిమా వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర అయింది. ఈ గ్యాప్ లో ఆయన
రమణ గోగుల నిర్మిస్తున్న 'బోణి' చిత్రానికి మాత్రమే కమిట్ అయి మరో సినిమా జోలికి పోలేదు. ఈ క్రమంలో సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోవాలనీ, తద్వారా కెరీర్ పై మరింత సీరియస్ గా వర్క్ చేసే అవకాశం ఉంటుందనీ అక్కినేని నాగేశ్వరరావు నచ్చజెప్పి ఒప్పించారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే హార్వార్డ్ యూనివర్శిటీలో ఎం.ఎస్. చదువుతున్న అమ్మాయిని సుమంత్ కు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారనీ, వచ్చే డిసెంబర్ లో పెద్ద హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఈ వివాహం జరుగుతుందనీ సుమంత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక 'బోణి' సినిమా విషయంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా వచ్చిన గ్యాప్ ను భర్తీ చేసేందుకు సుమంత్ వరుస ప్రాజెక్ట్ లను ఒప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Be first to comment on this News / Article!
|