బన్నీ ముక్కుకి సర్జరీ?
అల్లు అర్జున్ 'గంగోత్రి' సినిమా చూసిన వాళ్లకు ఆయన తర్వాత సినిమాల్లో చూస్తే 'వావ్' అనుకోకుండా ఉండలేరు. అంతలా మార్పు తెచ్చుకుని స్టయిలిష్ హీరోగా ముద్ర వేయించుకున్నారు. ఇందుకోసం కొన్ని సర్జరీలు కూడా చేయించుకున్నారని చెబుతారు. ఇక 'సిక్స్ ప్యాక్'తో యువ హీరోల్లో దేహధారుఢ్యంపై మక్కువ పెంచిన హీరోగా కూడా బన్నీని చెప్పుకోవచ్చు. పార్టీలు, పబ్ లలోనూ హుషారుగా కనిపించే అల్లు అర్జున్ ఇప్పుడు తన ముక్కుకు కూడా సర్జరీ చేయించుకోబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోటేరు లాంటి ముక్కుకోసం సర్జరీ చేయించుకావాలని ఆయన అనుకుంటున్నారనేది వాటి సారాంశం.
ఏదో పని కోసం బుధవారంనాడు అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్లారు. దీంతో ముక్కుకు సర్జరీ చేయించుకునే విషయంపై వైద్యులను సంప్రదించేందుకే ఆయన ఆసుపత్రికి వెళ్లారంటూ ప్రచారం మొదలైంది. సర్జరీతో ముక్కును షార్ప్ గా చేసుకుంటే మరింత సెక్సీ లుక్స్ తో కనిపిస్తావని ఆయన గాళ్ ఫ్రెండ్స్ సూచించారనీ, తన పెర్సనాలిటీకి మరింత హ్యాండ్ సమ్ అప్పీల్ అవసరమనే ఆలోచనతో అల్లు అర్జున్ కూడా ఉన్నారనీ పలువురు ఊహాగానాలు చేస్తున్నారు. స్టయిలిష్ హీరో మనోగతం ఏమిటనేది వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|