మిత్రుడు సక్సెస్ మీట్
బాలకృష్ణ, ప్రియమణి నాయకానాయికలుగా వైష్ణవి సినిమా పతాకంపై రూపొందిచిన మిత్రుడు చిత్రం విజయవంతం కావడంతో హైదరాబాద్ లోని మహతి రికార్డింగ్ థియేటర్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 222 ప్రింట్లతో సినిమాను విడుదల చేశామన్నారు. చిత్రం విజయాన్ని సాధించడంతో మరో 14 ప్రింట్లను పెంచబోతున్నామని తెలిపారు. బాలయకృష్ణ వైవిధ్యమైన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో వారి స్పందన చాలా బాగుందన్నారు. ఒకప్పుడు కమర్షియల్ చిత్రాలు ముద్దుల మావయ్య, లారీడ్రైవర్, భలేదొంగ వంటివాటిని బాలకృష్ణ చేసే సమయంలో ఆదిత్య 369 వంటి సోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కించానన్నారు. అప్పట్లో అది షాకింగ్ అనిపించినప్పటికీ, ఆ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. వంశానికొక్కడు వంటి ఫ్యామిలీ చిత్రం కూడా సక్సెస్ ను సాధించదన్నారు. ఇప్పుడున్న ట్రెండ్ లో యూత్ నవ్యత కలిగిన సినిమాలను కోరుకుంటున్నారు. ఆ కోణంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించడంతో మంచి విజయాన్నిసాధించినందుకు ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
మిత్రుడులో కొత్త సాంగ్
కాగా మిత్రుడు చిత్రం కోసం కొత్తగా ఓ పాటను చిత్రీకరించబోతున్నామని కృష్ణప్రసాద్ తెలిపారు. బాలకృష్ణ, ప్రియమణిలపై ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరించి త్వరలో సినిమాకు జతచేయబోతున్నామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మహాదేవ్ మాట్లాడుతూ ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కు ఓ కల వుంటుంది. ముందు చిన్న హీరో చిత్రం ద్వారా దర్శకుడిగా నిరూపించుకుని, తర్వాత పెద్ద హీరో చిత్రానికి దర్శకత్వం వహించాలని సహజంగా అనుకుంటారు. అయితే మొదటే బాలకృష్ణవంటి పెద్ద హీరో చిత్రానికి దర్శకుడిగా అవకాశం రావడం, కృష్ణప్రసాద్ ఇచ్చిన సహకారం మరువలేనిదని అన్నారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పక్కా ప్లానింగ్ తో తక్కువ రోజులలోనే ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేసి, విడదలచేసినందుకు తగిన ప్రతిఫలం అందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Be first to comment on this News / Article!
|