'మేగ్జిమ్' ప్రియమణి?
గ్రామీణ యువతిగా మేకప్ లేకుండా అతి సహజంగా నటించిన ప్రియమణికి 'పరుత్తి వీరన్' చిత్రం జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఏ తరహా పాత్రల్లో పేరొస్తే ఆ తరహా పాత్రలు మళ్లీ మళ్లీ ఆఫర్ చేయడానికి ఫిల్మ్ మేకర్ వెనుకాడరు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రియమణి తెలివిగా ఇమేజ్ ఛేంజోవర్ కోసం వరుసగా గ్లామర్ పాత్రల వైపు దృష్టిసారించి టాలీవుడ్ లో హీట్ వేవ్స్ సృష్టించడం మొదలుపెట్టింది. నితిన్ తో నటించిన 'ద్రోణ'లో ఓ పాట అంతా బికినీతో కనిపించి యువతరం ప్రేక్షకులకు కనికట్టుకట్టింది. ఆ వెంటనే ఒప్పుకున్న బాలకృష్ణ 'మిత్రుడు'లోనూ ప్రియమణి మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో అలరించింది. ఆమె కృషికి ఇప్పుడు సరైన గుర్తింపే లభించినట్టుంది. పాపులర్ 'మేగ్జిమ్' నుంచి ప్రియమణికి పిలుపు వచ్చిందనీ, ఫోట్ షూట్ కు హాజరుకమ్మని ఆహ్వానం లభించిందనీ పరిశ్రమ వర్గాల భోగట్టా.
'మేగ్జిమ్' కవర్ పేజీపై చేటుచేసుకోవడం అంటే ఎకాఎకిన స్టార్ డమ్ కు చేరుకోవడం గానే ఉత్తరాది భావాలంతా భావిస్తుంటారు. అలాంటి అవకాశం కోసం ఎదురుతెన్నులు చూస్తుంటారు. ఇటీవల దక్షిణాది హీరోయిన్ల నుంచి ఆసిన్, శ్రియ సైతం 'మేగ్జిమ్' కవర్ కు చేరి సంచలనం సృష్టించారు. తాజాగా మరో దక్షిణాది భామ ప్రియమణికి ఈ ఆఫర్ రావడం అరుదైన విషయంగానే చెప్పాలి. ఈ ఆఫర్ ను ప్రియమణి కూడా ఒప్పుకుందని తెలిసింది. త్వరలోనే ఫోటో షూట్ ఉంటుందనీ, ఆ వెంనటనే మేగ్జిమ్ కవర్ పై ప్రియమణి ప్రత్యక్షమవుతుందనీ చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె మణిరత్నం 'రావణ'లో నటిస్తోంది. 'మిత్రుడు' తర్వాత తెలుగులో మంచి ఆఫర్లే ఉన్నప్పటికీ ఇంకా ఫైనలేజ్ కావాలి.
Be first to comment on this News / Article!
|