22న '18, 20 లవ్ స్టోరీ'
శివాజీ పక్కా మాస్ పాత్రలో నటించిన చిత్రం '18,20 లవ్ స్టోరీ'. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో ఓ ప్రాంతాన్ని శాసించే రౌడీగా శివాజీ నటిస్తున్నారు. ఆయన సరసన శ్రద్ధాదాస్ నాయికగా నటిస్తోంది. కొప్పుల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైందనీ, ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామనీ నిర్మాత తెలిపారు.
శివాజీ ఇంతవరకూ నటించిన చిత్రాలకంటే భిన్నమైన పాత్రను ఇందులో పోషించారనీ, ఆయన చాలా కొత్తగా కనిపిస్తారనీ, శ్రద్ధాదాస్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తారనీ తెలిపారు. ఇందులోని ఐదు పాటల్లో 3 పాటలను బ్యాంకాక్ లో చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్ కూడా ఓ ప్రధానమైన హైలైట్ అవుతుందని శివాజీ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వినోద్ కుమార్, చిన్నా, ఎం.ఎస్.నారాయణ, ఝాన్సీ, మాస్టర్ భరత్, ప్రగతి, చిత్రం శీను, కమల్ తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం రాధాకృష్ణ అందించిన ఈ చిత్రానికి జి.శివకుమార్ సినిమాటోగ్రఫీ, ఎ.బి.మురళి సంగీతం అందించారు. బాలాశీ శ్రీను నిర్మాణ నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు.
Be first to comment on this News / Article!
|