పోసాని 'చేపలచెరువు' 15న
దర్శక రచయిత పోసాని కృష్ణమురళి 'రాజావారి చేపల చెరువు' అనే పొలిటికల్ సెటైర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగించుకున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. లక్ష్మీ గణపతి ఫిలింస్ పతాకంపై బి.సుబ్రమణ్యం, వై.రూపేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పోసాని నటిస్తూ దర్శకత్వం వహించారు.
వంచనకు గురిచేసే రాజకీయల గురించి ఈ చిత్రంలో చర్చించామనీ, ఏ పార్టీని, వ్యక్తిని ఉద్దేశించి ఈ చిత్రాన్ని తీయలేదనీ పోసాని తెలిపారు. ఇందులో తాను పోలీసు అధికారిగా నటించాననీ, ఉద్యోగం నుంచి తొలగించడంతో చెపల చెరువు పెట్టుకుని అన్యాయాలపై ఎలా పోరాడాన్నదే ఈ చిత్రకథ అనీ చెప్పారు. వాస్తవ సంఘటనలు ప్రతిబిబించే విధంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులను తప్పనిసరిగా ఆదరిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, కృష్ణభగవాన్, సునీల్, వేణుమాధవ్, గిరిబాబు, రంగనాథ్, చలపతిరావు, కొండవలస, బ్రహ్మాజీ, ప్రభాకర్ తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పోసాని సమకూర్చిన ఈ చిత్రానికి గాదిరాజు శ్రీను సినిమాటోగ్రఫీ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|