చరణ్ 'మగధీర' జూన్ 17
ఈ ఏడాది భారీ అంచనాలను రేకెత్తిస్తున్నచిత్రాల్లో రామ్ చరణ్ 'మగధీర' ఒకటి. 'చిరుత' చిత్రం ద్వారా డాన్సులు, ఫైట్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్న రామ్ చరణ్, ఇంతవరకూ ఫెయిల్యూర్స్ ఎరుగని దర్శకుడుగా పేరున్న ఎస్.ఎస్.రాజమౌళి తొలి కాంబినేషన్ లో 'మగధీర' చిత్రం రూపుదిద్దుకుంటోంది. 'జల్సా', 'గజనీ' (హిందీ) వంటి సంచలన విజయాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అంత్యత ప్రతిష్టాత్కంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. జూన్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
పునర్జన్మల కథాంశంతో 'మగధీర' రూపొందుతోంది. 400 ఏళ్ల క్రితం పెద్దల కారణంగా ఒకటి కాలేకపోయినా ప్రేమజంట మళ్లీ ఇప్పుడు జన్మించి తమ ప్రేమను పండించుకోవడమన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. రామ్ చరణ్ కు జోడిగా కాజల్ నటిస్తుండగా, రియల్ స్టార్ శ్రీహరి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాజస్థాన్, హైద్రాబాద్ తో పాటు విదేశాల్లోని రిచ్ లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది. ఇందులోని 'బంగారు కోడిపెట్ట' అనే రీమిక్స్ సాంగ్ లో రామ్ చరణ్ తో మెగాస్టార్ చిరంజీవి కలిసి నర్తించడంతో పాటు ఓ కీలక సన్నివేశంలోనూ కనపడనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా ఈనెలాఖరులో విడుదలవుతుంది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, రత్నం మాటలు, సెంథిల్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|