అనుష్క 'తకిట తకిట'
సూపర్ గాళ్ అనుష్క కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. 'అరుంధతి' చిత్రం సాధించిన సక్సెస్, 'బిల్లా' చిత్రంలో బికినీతో సృష్టించిన సంచలనం అనుష్కను మరింత పాపులర్ చేసింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు అనుష్క కోసం క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరుడు' చిత్రంలో మహేష్ బాబు జంటగా అనుష్క నటిస్తోంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రధారులుగా క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి రానున్న 'వేదం' చిత్రంలో అనుష్క ఎంపిక దాదాపు ఖాయమైంది. వీటికితోడు నటి భూమిక తొలిసారి నిర్మాతగా మారి రూపొందించనున్న చిత్రంలోనూ హీరోయిన్ గా అనుష్క తో సంప్రదింపులు జరుగుతున్నాయి.
నటిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన భూమిక ఇటీవల తన భర్త భరత్ ఠాకూర్ తో కలిసి 'డౌన్ టౌన్ ప్రొడక్షన్స్ ' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో సంస్థ తొలిచిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల భూమికతో 'సత్యభామ' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీహరి నాను ఈ కొత్త చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు. అనుష్క అయితే ఈ చిత్రంలోని కథానాయిక పాత్రకు సరైన న్యాయం జరుగుతుందని భావించిన భూమిక ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి 'తకిట తకిట' అనే టైటిల్ ను కూడా ప్రకటించారు. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|