'ఆక్రందన'గా ఆర్య-2
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్య 2'. కెరీర్ ప్రారంభంలో ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా ఈ తాజా చిత్రం రూపొందుతోంది. తొలి వెర్షన్ కు దర్శకుడైన సుకుమార్ ఈ సీక్వెల్ కు సైతం దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై వి.ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంతవరకూ 'ఆర్య-2'గా ప్రచారమైన ఈ చిత్రానికి ప్రస్తుతం టైటిల్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. తాజా సమచారం ప్రకారం 'ఆక్రందన' అనే టైటిల్ పరిశీలనలో ఉందనీ, దాదాపు ఈ టైటిల్ ఖరారు కావచ్చనీ తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఆల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తుండగా, ఆయనకు జోడిగా కాజల్ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ లో ఆడియో జూలై ప్రథమార్థంలో సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో 'వేదం' చిత్రానికి అల్లు అర్జున్ కమిట్ అయ్యారు. వీటి తర్వాత సొంత బ్యానర్ గీతా ఆర్ట్ లోనూ ఓ చిత్రానికి పనిచేస్తారు.
Be first to comment on this News / Article!
|