త్రిష లిప్ కిస్...బికినీ!
నయనతార, అనుష్క, ప్రియమణి వంటి తారలు ఇప్పటికే 'బికినీ'లు ధరించి హీట్ వేవ్స్ సృష్టించగా...ఇప్పుడు అందాల నటి త్రిష కూడా బికినీ క్లబ్ లో చేరిందట. అదనంగా లిప్ కిస్ తోనూ అలరించబోతోందట. ఆర్య-త్రిష జంటగా విష్ణువర్దన్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధమైన తమిళ 'సర్వం' చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఈ ముద్దుముచ్చట చోటు చేసుకుందనీ, గోవా బీచ్ లో తీసిన ఓ సన్నివేశంలో త్రిష బికినీ అందాలతో అలరించనుందనీ కొద్దిరోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రధాన చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై త్రిష, ఆర్యతో పాటు విష్ణువర్దన్ సైతం చిరునవ్వుతో కొద్దిపాటి సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.
త్రిషను అడిగితే...గోవా బీచ్ లో బికినీతో కనిపించనున్నాననే వార్తా కథనాలు తన దృష్టికి కూడా వచ్చాయనీ, నిజంగా ముద్దు సన్నివేశంలో నటించానా, బికినీతో కనిపిస్తానా అనేది సినిమా చూసి తేల్చుకోవాల్సిందేననీ ఆమె నవ్వుతూ చెబుతోంది. అయితే సినిమాలో ఈ ముద్దు సన్నివేశం కన్ను తెరచి కన్నుమూసే లోపల మాయమవుతుందనీ, హీరో ఆర్య త్రిషను తలుచుకుని సాంగ్ లోకి వెళ్లన సందర్భంలో ఈ ఘట్టం ఉంటుందని సినీ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. దీనిపై విష్ణువర్దన్ వివరణ ఇస్తూ, ఇండియన్ ఫిల్మ్ లో ముద్దు సన్నివేశాలు ఇప్పుడేమీ కొత్త కాదనీ, సినిమాలో ఈ ఘట్టం కీలకమైనందున హుందాగా చిత్రీకరించామనీ చెబుతున్నారు. ఆర్య సైతం మరింత క్యూరియాసిటీని పెంచుతూ, కెమెరా లైట్లు, 50-60 మంది యూనిట్ సభ్యుల ముందు ముద్దు సన్నివేశంలో పాల్గొనడం ఆషామాషీ కాదనీ, మరో టేక్ చేద్దామంటూ విష్ణువర్దన్, కెమెరామన్ నీరవ్ రిక్వెస్ట్ చేయడంతో ఆరు టేకులు తర్వాతే సన్నివేశం ఓకే అయిందనీ చెప్పారు. ఎవరేమి చెప్పినా అసలు నిజం ఏమిటనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. ఈ శుక్రవారమే 'సర్వం' చిత్రం విడుదలవుతోంది.
Be first to comment on this News / Article!
|