ముమైత్ కు ఆఖరి 'టార్గెట్'
సెక్సీ ఐటెం గాళ్ గా సంచలనం సృష్టించిన ముమైత్ ఖాన్ ఇప్పుడో చిత్రమైన సమస్య ఎదుర్కొంటోంది. ఇటీవల ఐటెం సాంగ్స్ తగ్గించుకుని హీరోయిన్ వేషాల వైపు మళ్లితే అక్కడ ఇంతవరకూ హిట్ బోణీ తగల్లేదు. పోనీ మళ్లీ ఐటెం సాంగ్స్ వైపు మళ్లుదామంటే ముమైత్ ఇచ్చిన గ్యాప్ లో ఐటెం గాళ్స్ పోటీ పెరిగిపోయింది. దీనికితోడు స్టార్ హీరోయిన్లు సైతం ఇటీవల బికినీ అందాలతో హోరెత్తిస్తుండటం ముమైత్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'టార్గెట్' చిత్రం ఒక్కటే ముమైత్ కు ఉన్న చివరి అవకాశంగా ఆమెను ఊరిస్తోంది.
ముమైత్ యాక్షన్ కథానాయికగా తొలిసారి నటించిన 'మైసమ్మ ఐపిఎస్' చిత్రం, ఆ తర్వాత వచ్చిన 'మంగతాయారు టిఫిన్ సెంటర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'పున్నమినాగు' సైతం ఓపినింగ్ కలెక్షన్లను కూడా రాబట్టలేక చతికిలపడింది. ఇందులో ముమైత్ శక్తివంచన లేకుండా బికినీ అందాలు ఆరబోసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడా రేపా అంటూ కొద్దికాలంగా ఊగిసలాడ దోరణిలో విడుదలకు పలు దఫాలు వాయిదాలు తీసుకున్న 'టార్గెట్ ' చిత్రంపైనే ముమైత్ ప్రస్తుతం ఆశలు పెట్టుకుంది. ఇందులో ముమైత్ ఖాన్ హాలీవుడ్ సంలన తార 'షరాన్ స్టోన్' భంగిమలతో క్రైమ్ రచయిత్రగా ప్రధాన భూమిక పోషించడం విశేషం. 'బేసిక్ ఇన్ స్టెంట్' స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీసు అధికారిగా శివబాలాజీ, అతనికి జోడిగా హాటెస్ట్ తార శ్రద్ధాదాస్ నటించారు. రమేష్ రాజా దర్శకత్వంలో సంగిశెట్టి దశరథ ఈ చిత్రాన్ని నిర్మించారు. కారణాంతరాల వల్ల విడుదలలో జాప్యం జరుగుతున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్షన్ చిత్రాల హీరోయిన్ గా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ముమైత్ ఆశ 'టార్గెట్'తోనైనా తీరుతుందేమో చూడాలి. ఒకవేళ తారుమారైతే మాత్రం గడ్డుకాలమే...
Be first to comment on this News / Article!
|