వారంలో 11.44 కోట్ల 'కిక్'
సమ్మర్ సీజన్ కు సరైన 'కిక్' దొరికింది. 'అరుంధతి' చిత్రం తర్వాత సుమారు నాలుగు నెలలుగా సరైన హిట్ లేని పరిశ్రమకు 'కిక్' చిత్రం సాధిస్తున్న విజయం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 8న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి ఓపినింగ్స్ సాధించి బాక్సాఫీస్ కలెక్షన్లతో రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలి ఏడు రోజుల్లో ఈ చిత్రం 11.44 కోట్ల రూపాయల షేర్ ను సాధించి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే దిశగా ఈ చిత్రం దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రవితేజ గత హిట్ చిత్రమైన 'కృష్ణ' వసూళ్లను అన్నిచోట్లా ఈ చిత్రం అధిగమిస్తుండగా, రాబోయే వారాల్లో ఈ చిత్రం సాధించే కలెక్షన్ల ఆధారంగా ఏ స్థాయి హిట్ అనేది నిశ్చయమవుతుందనీ ఆ వర్గాలు చెబుతున్నారు.
నైజాంలో 'కిక్' చిత్రం మొదటి వారాంతానికి రూ.5.09 కోట్ల షేర్ తో రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత స్థానంలో సీడెడ్ లో 1.78 కోట్ల షేర్ రాబట్టింది. నెల్లూరు, గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్ తో పాటు కర్నాటక, ఓవర్ సీస్ లలో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టి రెండో వారంలోకి దూసుకు వెళ్లింది. 'కిక్' చిత్రానికి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, తమిళంలో విజయ్, కన్నడంలో సుదీప్ హీరోలుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Be first to comment on this News / Article!
|