200 ప్రింట్లతో 29న 'పిస్తా'
విశాల్, శ్రియ జంటగా జి.కె.ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మించిన ద్విభాషా చిత్రం 'పిస్తా'. తమిళంలో 'తోరణి' అనే పేరుతో రూపొందింది. సభా అయ్యప్ప దర్శకుడు. ఇటీవల కాశ్మీర్, లడఖ్ పరిసర్లాల్లో చివరి పాట చిత్రీకరణతో షూటంగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న రెండు భాషల్లోనూ విడుదల చేస్తున్నట్టు విక్రమ్ కృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 200 ప్రింట్లతో ఈ చిత్రాన్ని రీలజ్ చేస్తున్నామనీ, విశాల్ కెరీర్ లోనూ అత్యధిక ప్రింట్లతో విడుదలవుతున్న చిత్రమిదనీ చెప్పారు.
'పిస్తా' చిత్రం చాలా బాగా వచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులకూ మంచి వినోదాన్ని అందించిన విశాల్ కు మరో పెద్ద సక్సెస్ ను అందిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నామనీ విక్రమ్ కృష్ణ తెలిపారు. మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే శ్రోతలను బాగా ఆక్టుకుంటోదని చెప్పారు. ఇది ఒక అపార్ట్ మెంట్ లో జరిగే కథనీ, గ్రామం నుంచి వచ్చిన యువకుడు అపార్ట్ మెంట్ సంస్కృతికి ఎలా మారాడన్నది ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. విశాల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుంచి విశాఖ చేరుకున్న యువకుడి కథ ఎలాంటి మలుపులు తిరిగందనేది దర్శకుడు ఎంచో చక్కగా తెరకెక్కించారనీ, ఇందులో తన పాత్ర యాక్షన్ తో పాటు చక్కటి వినోదాన్ని కూడా పంచుతుందన్నారు. శ్రియ గ్లామర్, నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. తెలుగులోని దాదాపు అందరు కమెడియన్లు ఈ చిత్రంలో ఉన్నారని చెప్పారు. ఈ ఇందులో తొలిసారి తాను ప్రకాష్ రాజ్ తో కలిసి నటించినట్టు వెల్లడించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణ, కొండవలస, తెలంగాణ శకుంతల, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్నారు. శశాంక్ వెన్నెలకంటి మాటలు, సాహితి-అనంత్ శ్రీరామ్ పాటలు, రాఖీ ముఖేష్ ఫైట్స్, ప్రియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|