కరీనా బాటలో శ్రియ!
సిక్స్ ప్యాక్...సైజ్ జైరో..బికినీ...ఏ 'వుడ్' అయినా ఇప్పుడు ఈ మూడూ లేకుండా సినిమాలు తీయని పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు బికినీ ధరించడమన్నా, లిప్ టు లిప్ కిస్సన్నా జనం 'కస్సు' మంటారేమోననే అభిప్రాయం ఫిల్మ్ మేకర్స్ లో కనిపించేంది. ఇప్పుడు అవన్నీ కామన్. స్టార్ హీరోల నుంచి కుర్రహీరోల వరకూ సిక్స్...ఎయిట్ ప్యాక్ లతో ఊదరగొట్టేస్తుంటే, హీరోయిన్లు సైజ్ జీరో మంత్రం జపిస్తూ బికినీ అందాలను ఆరబోస్తూ వెండితెర నుండా గ్లామర్ పంచుతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవల 'తషన్' చిత్రంలో సైజ్ జీరో గెట ప్ ను సంతరించుకుని బికినీలో సునాయాసంగా ఇమిడిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావం కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పాకింది. నయనతార తమిళ 'బిల్లా'లో బికినీ ధరించి సంచలనం సృష్టిస్తే, ఆ సినిమా తెలుగు వెర్షన్ 'బిల్లా'లో అనుష్క బికినీ ధరించి కుర్రకారును కట్టిపడేసింది. దీనికి కొద్ది ముందుగా ప్రియమణి 'ద్రోణ' చిత్రంలో ఒక పాటంతా బికినీలో కనిపించింది. ఇప్పుడు అందాలనటి శ్రియ వంతు వచ్చింది. అయితే తక్కిన హీరోయిన్ల తరహాలో కాకుండా కరీనా బాటలో శ్రియ సైజ్ జోరో ఆహార్యం సంతరించుకుని బికినీలో ఒదిగిపోవడం ఈసారి స్పెషాలిటీ. అంతేకాదు...'తషన్'లో కరీనా తరహా బికినీనే శ్రియ ధరించడం మరో ప్రత్యేకత.
విశాల్ కథానాయకుడుగా విడుదలకు సిద్ధంగా ఉన్న 'పిస్తా' చిత్రం కోసం శ్రియ ఈ బికినీ యాక్ట్ చేసింది. ఇందులో శ్రియ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందనీ, ఈసారి ఆమె కామెడీ కూడా పండించిందనీ చెబుతున్నారు. శ్రియ బికినీ ధరించిన హాటెస్ట్ ఫోటోలు అధికారికంగా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇందులో శ్రియ ఒక రెయినీ సాంగ్ లో స్విమ్ కాస్ట్యూమ్ తో కనువిందు చేయబోతోంది. శ్రియ గ్లామర్ తమ చిత్రానికి ప్రత్యేక ఎస్సెట్ కానుందని విశాల్ బలంగా నమ్ముతున్నారు. శ్రియ ఎలాంటి సంచలనం సృషించనుందనేది తెలియలాంటే ఈనెల 22వరకూ వేచిచూడాల్సి ఉంది. ఇదే రోజు 200 ప్రింట్లతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 'పిస్తా' విడుదలవుతోంది.
Be first to comment on this News / Article!
|