జెట్లీ 'అంతిమపోరాటం'22న
హాలీవుడ్ రైజింగ్ స్టార్ జెట్ లీ, 'ట్రాన్ పోర్టర్' హీరో జాసన్ స్టాతిమ్ కాంబినేషన్ లో హాలీవుడ్ లో విజయవంతమైన 'రోగ్ అసాసిన్' చిత్రం తెలుగులో 'అంతిమ పోరాటం' పేరుతో అనువాదమైంది. అర్విక ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెల 22న ఈ చిత్రాన్ని ఆంధ్రదేశమంతటా విడుదల చేస్తున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు.
ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలతో పూర్తి స్థాయి యాక్షన్ సన్నివేశాలతో 'అంతిమ పోరాటం' చిత్రాన్ని దర్శకుడు పిలిప్ జి అట్ నెల్ అద్భుతంగా తెరకెక్కించారని ఆయన చెప్పారు. జెట్ లీ, జాసన్ స్టాతిమ్ మధ్య నడిచే సన్నివేశాలను ప్రేక్షకులకు ఉత్కంఠకు గురిచేస్తాయని అన్నారు. తన వాళ్లను చంపిన హంతుకలను జెట్లీ వేటాడి వెంటాడి చంపుతుంటాడనీ, జెట్ లీని అడ్డుకునే పోలీసు అధికారిగా జాసన్ స్టాతిమ్ నటించారనీ చెప్పారు. చివరకు జెట్లీ తన ఆశయాన్ని ఎలా సాధించాడన్నది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. సమ్మర్ స్పెషల్ గా అత్యధిక ప్రింట్లతో ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని 22న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|