29న 'ప్రయాణం'
'నేను మీకు తెలుసా' చిత్రంతో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'ప్రయాణం'. హారిక కథానాయిక. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఆర్యకి ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఓ ఎయిర్ పోర్ట్ లో రెండు గంటల్లో జరిగే కథ ఇది. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నట్టు చంద్రశేఖర్ ఏలేటి తెలిపారు.
వైవిధ్యాన్ని ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికి ఈ చిత్రం నచ్చుతుందనీ, కథలోని ముప్పాతిక భాగం ఎయిర్ పోర్ట్ లోనే జరగడం అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తుందనీ చెప్పారు. ఇందులో యాక్టివ్ గా ఉండే కథానాయకుడు హీరోయిన్ ప్రేమకోసం సాఫ్ట్ గా తయారు కావడం, మళ్లీ తన యాక్టివ్ నెస్ లోకి వెళ్లిపోవడం ఆసక్తికరంగా ఉంటాయనీ, మనోజ్ అద్భుతంగా నటించాడనీ చెప్పారు. ఇందులో నేటి తరం యువకుడికి ప్రతీకగా తన పాత్ర ఉంటుందని మనోజ్ కుమార్ తెలిపారు. ఎక్కడెంత అల్లరి చేసినా నచ్చిన అమ్మాయి ముందు బుద్ధిగా కనిపించే పాత్ర తనదనీ, దర్శకుడు చాలా కొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ చెప్పారు. మహేష్ శంకర్ మంచి సంగీతం అందించారనీ, రీరికార్డింగ్ హైలైట్ గా నిలుస్తుందనీ అన్నారు. బ్రహ్మానందం కామెడీ మరో ప్రధాన హైలైట్ కానుంది. ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|