విశాల్ తో శ్రియ 'లిప్ లాక్'
నయనతార, అనుష్క, ప్రియమణి...ఇలా ఒక్కొక్కరూ బికినీ బ్రిగేడ్ లో వచ్చి చేరుతుంటే అందాల నటి శ్రియ ఈ పోటీని మరింత తీవ్రం చేస్తూ 'పిస్తా' చిత్రం కోసం జీరో సైజ్ ఆహార్యం సంతరించుకుని స్విమ్ సూట్ తో తుళుకులీనబోతోంది. దీనికి తోడు హీరో విశాల్ తో 'లిప్ లాక్' వ్యవహారమూ ఇందులో చోటుచేసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. 'తషన్' చిత్రంలో కరీనా కపూర్ ధరించిన బికినీకి దగ్గరగా ఉండే స్విమ్ షూట్ ను ఇందులో శ్రియ ధరించడంతో పాటు వర్షం సాంగ్ లో అందాలను ఆలోవకగా ఆరబోయడం ఇప్పుడు పబ్లిసిటీ పోస్టర్లు, ఫోటోల రూపంలో శ్రియ అభిమానులను అలరిస్తున్నాయి. ఇదే తరుణంలో విశాల్ తో 'లిప్ లాక్' సీన్ లో కూడా శ్రియ నటించినట్టు తెలిపే ఫోటోగ్రాఫ్ లు కూడా ఇప్పుడు నెట్ లో స్వైరవివాహం చేస్తున్నారు.
కొద్దికాలంగా సరైన హిట్లు లేని హీరో విశాల్ ఇప్పుడు తన ఆశాలన్నీ 'పిస్తా' పైనే పెట్టుకున్నారు. రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ శ్రియ గ్లామర్ డోస్ తో కనపించే ఫోటోలను మీడియాకు అధికారికంగా రిలీజ్ చేశారు. వీటితో పాటే విశాల్ - శ్రియ 'లిప్ లాక్' ఫోటోలు కూడా నెట్స్ లో చోటుచేసుకోవడం తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి కళాత్మకంగా చిత్రీకరించిన సన్నివేశాలు కావచ్చా, ఇలా కనిపించి అలా మాయమయ్యే నిడివితో ఉండబోతున్నాయా, ఇవన్నీ కాకుండా 'మార్ఫ్' వ్యవహారం ఏదైనా ఉందా అనే సందేహాలూ కలగక మానవు. బాలీవుడ్ లో 'ముద్దు' బహిరంగ వ్యవహారమే అయినా దక్షిణాది భాషా చిత్రాల్లో చివరివరకూ 'గుట్టు' పాటించడమే రివాజు. విశాల్ తో శ్రియ 'డీప్ కిస్' వ్యవహారంలో నిజానిజాలెంతనేది తేలాలంటే ఈనెల 29న 'పిస్తా' రిలీజయ్యేంత వరకూ ఆగాల్సిందే. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో 'తోరణై' పేరుతో ఇదేరోజు విడుదలవుతోంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|