ప్రియమణి పెళ్లి యోచన?
'ద్రోణ', 'మిత్రుడు' చిత్రాలతో టాలీవుడ్ పై ఇప్పుడు ఎక్కువగా దృష్టి సారిస్తున్న ప్రియమణి ఇప్పుడు పెళ్లి వ్యవహారాన్ని సీరియస్ గానే ఆలోచిస్తోందనంటూ బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నారు. విశాల్, జీవన్, పృధ్వీరాజ్ ఇలా పలువురితో ప్రియమణి ప్రేమలో పడిందంటూ గతంలో పలు వదంతులు వినిపించినా వాటిని ప్రియమణి తోసిపుచ్చుతూ వచ్చింది. విశాల్ తన కో స్టార్ మాత్రమేననీ, పృధ్వీరాజ్ కుటుంబసభ్యులు తమకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా యువ కథానాయకుడు తరుణ్ తో ప్రియమణి ప్రేమలో పడిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి 'నవవసంతం' చిత్రంలో నటించే సమయంలోనే ఒకరికొకరు దగ్గరయ్యారని వారంటున్నారు. దీనికి సైతం ప్రియమణి ఖండిస్తూనే...తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేననీ, ఆ సినిమా తర్వాత తాము కలవలేదని చెబుతోంది. అయితే నిప్పులేందే పొగరాదనీ, ఈ ఇద్దరూ తరచు ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో కనిపించడం కూడా వారిద్దరూ ప్రేమలో పడ్డారనే వదంతులకు బలం చేకూరుస్తోందనీ సినీ వర్గాలు నమ్మబలుకుతున్నాయి.
తరుణ్ ఇటీవల ఓ ఖరీదైన కారును ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడనీ, తరుణ్ తల్లి రోజారమణి సైతం వీరి వ్యవహారం తన దృష్టిలో పడటంతో వివాహానికి సుముఖంగానే ఉందనీ ఆ వర్గాల కథనం. ప్రస్తుతం ప్రియమణి తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉందనీ, ఆ తర్వాతే లవర్ బాయ్ తరుణ్ ను కొంగున ముడేసుకుంటుందనీ అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం...
Be first to comment on this News / Article!
|