'పిస్తా' లిప్ కిస్ లీకేనట
క్రేజీ సినిమాలకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, సాంగ్స్ ఏదోరకంగా 'లీక్' కావడం ఇటీవల కామన్ అయింది. సహజంగా సినిమాల రిలీజ్ కు ముందో, ఆడియో విడుదలకు ముందో ఇలాంటి లీకేజీ వ్యవహారాలు నడుస్తుంటాయి. ఎడిటింగ్ టేబుల్ వద్ద నుంచి ఇలాంటివి లీక్ అయ్యిండొచ్చని నిర్మాతలు లబోదిబో మంటే, కొందరు ఇలాంటివన్నీఉచితంగా వచ్చే పబ్లిసిటీ బూస్టప్ కోసం నిర్మాతలు చేసే జిమ్మిక్స్ అనీ విశ్లేషిస్తుంటారు. ఇప్పుడు ఈ లీకేజీల వ్యవహారం 'లిప్ 2 లిప్' సీన్లకూ పాకడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తమిళ 'సర్వం' చిత్రం కోసం త్రిష-ఆర్య జంట 'హాట్ కిస్' సన్నివేశంలో నటించారంటూ నిన్నటి వరకూ ప్రచారం జరిగింది. ఇప్పుడు 'పిస్తా' చిత్రం వంతు వచ్చింది. విశాల్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం మరో వారం రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ ఇద్దరి మధ్యా చోటు చేసుకున్న'లిప్ 2 కిస్' ఫోటోలు నెట్స్ లో స్వైర వివాహం చేస్తూ జనాల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ సన్నివేశాన్ని ట్రయిలర్స్ గా భాగంగానే తీశామనీ, లీకేజీ వీరుల పుణ్యంతో ముందే ఫోటోలు బయటకు వచ్చేశాయనీ చిత్ర సహనిర్మాత, విశాల్ వదిన (నిర్మాత విక్రమ్ కృష్ణ భార్య) వివరణ ఇచ్చింది.
'ట్రయిలర్ లో ఈ సన్నివేశం ఉన్నమాట నిజం. అయితే వీటిని పబ్లిక్ చేయడం విశాల్ కు ఎంతమాత్రం ఇష్టంలేదు. అయితే అంతకు ముందే ఎవరో ఇంటర్నెట్ కు వీటిని లీక్ చేశారు' అని శ్రియారెడ్డి తెలిపింది. ఇదెంతమాత్రం పబ్లిసిటీ స్టంట్ కాదనీ, విశాల్ యాక్షన్ చూసేందుకు జనాలు థియేటర్లకు వస్తారు కానీ, అలాంటి సన్నివేశాలు చూసి మాత్రం కాదనీ అన్నారు. మరింత వివరణ ఇస్తూ...ఓ కామెడీ సన్నివేశంలో భాగంగానే ఈ కిస్సింగ్ సీన్ ఉంటుందనీ, కొందరు ఊహిస్తున్నట్టు రెచ్చగొట్టే తరహాలో మాత్రం ఉందనీ అన్నారు. సినిమా చూసిన తర్వాత ఈ ముద్దు సన్నివేశం సందర్భోచితంగానే ఉందని ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారని అన్నారు. నెట్స్ లోకి చొరబడిన ఫోటోలు తప్పదారి పట్టించేలా ఉన్నాయని శ్రియ కూడా అభిప్రాయపడుతోంది. సినిమాలో లిప్తపాటు మాత్రమే కనిపించే సన్నివేశమిదనీ, ఎలాంటి వల్గారిటీకి తావులేని విధంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారని ఆమె చెబుతోంది. మొత్తానికి.. లీకేజీ వీరుల పుణ్యమా అని 'పిస్తా' సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ బూస్టప్ మాత్రం వచ్చిచేరింది.
Be first to comment on this News / Article!
|