17 ముద్దులిచ్చిన శ్రియ!
'ఇష్టం'తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రియ ఇప్పుడు తన ఇష్టమంతా తమిళ హీరోలు, సినిమాలపైనే చూపుతున్నట్టుంది. వచ్చే వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ద్విభాషా చిత్రం 'పిస్తా' (తమిళ తోరణై), దీనికి రెండు వారాల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న 'మల్లన్న' (కందసామి) చిత్రాల్లో శ్రియ కథానాయిక. 'పిస్తా' చిత్రంలో విశాల్-శ్రియ 'లిప్ 2 లిప్' కిస్ సన్నివేశంలో నటించినట్టు తెలిపే ఫోటోగ్రాఫ్ లు ఇప్పటికే బయటకు వచ్చి ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. ఆసక్తికరంగా 'మలన్న'లోనూ సరిగ్గా ఇలాంటి సన్నివేశమే విక్రమ్-శ్రియ మధ్య చోటుచేసుకుందట. ఈ విషయం తమిళ వెర్షన్స్ 'కందసామి' ఆడియో ఫంక్షన్ లో బయట పడింది. ఇందులో భాగంగా సినిమా ట్రైలర్ ను ప్రదర్శించినప్పుడు ఈ లీడ్ పెయిర్ మధ్య నడిచిన 'కిస్సింగ్ సీన్' కూడా చోటుచేసుకుంది. దీనిపై ఆరా తీస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి.
ఈ ముద్దు సన్నివేశాన్ని ఎంఆర్ సి నగర్ లో చిత్రీకరించారనీ, శ్రియ ముద్దు పెట్టిన సన్నివేశం ఒకపట్టాన ఓకే కాలేదనీ సినీ వర్గాల భోగట్టా. బెటర్ మెంట్ కోసం 'వన్ మోర్ టేక్'...అంటూ దర్శకుడు 17 టేక్ లు లాగించేశారట. ఈ సన్నివేశం పూర్తయ్యే సరికి ఉక్రోషం పట్టలేక శ్రియ సెట్స్ నుంచి బయటకు వచ్చేసిందనీ, అసలు ముందుగా ఈ సన్నివేశం గురించి దర్శకుడు తనకు చెప్పలేదని చిర్రుబుర్రలాడిందనీ ఆ వర్గాల కథనం. అయితే విక్రమ్, సుశీ గణేషన్ కలిసి ఆమెను బుజ్జగించడంతో మళ్లీ వర్కింగ్ మూడ్ లోకి వచ్చేసిందట. 'లిప్ 2 లిప్' కిస్ నిజమేనా అని శ్రియను ప్రశ్నిస్తే 'ఈ ప్రశ్నకు మాత్రం నేను సమాధానం ఇవ్వను. రేపు సినిమా చూశాక అలాంటి సన్నివేశాలు ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది' అంటూ సమాధానం దాటవేసింది. మళ్లీ తమాయించుకుని... ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ చిత్రమని చెప్పలేకపోయినా కొంతవరకూ రొమాన్స్ ఉన్నమాట వాస్తవమేననీ, స్టయిలిష్ కాస్ట్యూమ్స్ తో కొత్ర శ్రియను మాత్రం చూస్తారంటూ ఊరించింది.
Be first to comment on this News / Article!
|