జూన్ 5న వస్తున్న 'రైడ్'
నేటి యువత ఒక లక్ష్యం నిర్దేశించుకుంటే దానిని సాధించేదాకా విడిచిపెట్టరనీ, యువత మనోభావాలకు అద్దంపట్టే విధంగా 'రైడ్' చిత్రం రూపొందిందనీ ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. నాని ('అష్టాచమ్మ' ఫేమ్), తనీష్ (నచ్చావులే), అక్ష (యువత), శ్వేతబసు ప్రసాద్ (కొత్త బంగారులోకం) హీరోహీరోయిన్లుగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. రమేష్ వర్మ దర్శకుడు. ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు బెల్లంకొండ సురేష్ తెలిపారు.
'నేటి యువతకు నచ్చే అన్ని అంశాలతో దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాణం జరిపాం. గాయకుడు హేమచంద్రను సంగీత దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఆయన అందించిన ఆడియో ప్రేక్షకాభిమానులను అలరిస్తోంది. సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి' అని బెల్లంకొండ తెలిపారు. ఇద్దరు స్నేహితుల కథతో ఈ చిత్రాన్ని రూపొందిచినట్టు రమేష్ వర్మ తెలిపారు. నాని, తనీష్ లకు ఈ చిత్రం మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందనీ, వీరితో పాటు హీరోయిన్లకు కూడా తొలి సినిమాను మించి మంచి పేరు వస్తుందనీ ఆయన అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, తులసి, సుధ, కిన్నెర, హేమ, ఆదర్స్, సత్యం రాజేష్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్ారు. రమేష్ వర్మ కథ, శశాంక్ వెన్నెలకంటి మాటలు, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|