స్విస్ డబ్బులు పంచే విక్రమ్!
ఇప్పుడంతా చియాన్ విక్రమ్ 'మల్లన్న' ఫీవర్ నడుస్తోంది. తెలుగు, తమిళ ('కందసామి') భాషల్లో ఈ చిత్రాన్ని జూన్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాత కలైపులి ధాను, దర్శకుడు సుశీ గణేషన్ సన్నాహాలు చేస్తున్నారు. ఏడాదిన్నరకు పైగా చిత్ర నిర్మాణం జరుపుకొన్న ఈ చిత్రాన్ని 35 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. 4.5 కోట్ల రూపాయలకు శాటిలైట్ రైట్స్ అమ్మకాలు జరపడం కూడా ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. దర్శకనిర్మాతలతో సహా విక్రమ్ విస్తృతంగా ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రంలో సిబిఐ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు విక్రమ్ వెల్లడించారు. జేమ్స్ బాండ్ తరహాలో తన పాత్ర ఉంటుందనీ, ఆడవేషంతో సహా 8 గెటప్స్ లో కనిపిస్తాననీ నవ్వుతూ చెప్పారాయన. ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్, ఫైట్స్, సాంగ్స్...ఇలా ప్రతీ అంశమూ హైలైట్ గా నిలుస్తుందని ఆయన అంటున్నారు. ఈ చిత్రం స్టోరీలైన్ ప్రకారం ఇందులో విక్రమ్ స్విస్ ఖాతాల్లో డిపాజిట్ అయిన కోట్లాది రూపాయలను తెచ్చి పేదలకు పంచుతారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో స్విస్ ఖాతాల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకు రప్పిస్తామనే ప్రచారాన్ని కూడా కొందరు నాయకులు చేపట్టిన నేపథ్యంలో ఆ పాయింట్ ను ముందుగానే అందిపుచ్చుకున్న 'మల్లన్న' టీమ్ ను అభినందించాల్సిందే.
Be first to comment on this News / Article!
|