12న సుమంత్ 'బోణి'
నాగార్జున మేనల్లుడుగా పరిశ్రమలోకి వచ్చిన సుమంత్ దాదాపు ఏడాదిన్నర తర్వాత 'బోణీ'తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. హీరోగా తొలినాళ్లలో పలు ప్లాపులు చవిచూసిన సుమంత్ కు 'సత్యం' తర్వాత ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ లభించలేదు. 'గౌరి', 'గోదావరి', 'మధుమాసం' వంటి చిత్రాలు కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నాయి. యాక్షన్ ఇమేజ్ కోసం చేసిన 'పౌరుడు' చిత్రం యావరేజ్ రేంజ్ గానే నిలిచింది. ఆ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని ఇంతకాలానికి సుమంత్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సహజంగానే అక్కినేని వంశాభిమానుల్లో ఉత్సాహం తొంగిచూస్తుంది. సుమంత్ సైతం 'సత్యం' వంటి బిగ్సెస్ట్ హిట్ మళ్లీ 'బోణి'లో లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారడం విశేషం. గ్రీన్ మ్యాంగోస్ బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని నిరమించారు. అమెరికాలో ఇంజనీర్ గా పనిచేసిన రాజ్ పిప్పళ్ల ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుమంత్ సరసన కీర్తి కర్బంద హీరోయిన్ గా పరిచయమవుతోంది. సుమంత్ ఇంతవరకూ నటించని విలక్షణ పాత్రలో ఇందులో నటించారనీ, ఆయన కెరీర్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందనీ రాజ్ పిప్పళ్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. రమణ గోగుల సంగీత దర్శకుడిగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్ వస్తుండటం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈనెల 12న 'బోణి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆసక్తికరంగా నాగార్జున మరో మేనల్లుడు సుశాంత్ నటించిన 'కరెంట్' చిత్రం వారం రోజుల గ్యాప్ లో ఈనెల 19న విడుదలవుతోంది. వరసకు అన్నదమ్ములైన సుశాంత్, సుమంత్ లలో ఎవరిది పైచేయి అవుతుందనేది సినీగోయెర్స్ లో ఉత్సుకత రేపుతోంది.
Be first to comment on this News / Article!
|