ఆకర్షణలో పడను: యండమూరి
తెలుగు చిత్ర సీమలో కథల కొరత ఉందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, దర్శకులు కాన్ఫిడెంట్ గా ఉండి, హీరోలను ఒప్పించగలిగితే మంచి కథా చిత్రాలు తప్పనిసరిగా వస్తాయన్నారు. ఎవరైనా తనను నమ్మి రెండు కోట్లు రూపాయలు పెట్టి సినిమా తీయాలని వస్తే మళ్లీ దర్శకత్వం వహిస్తానని చమత్కరించారు. 'డైరీ'లో రచయిత పాత్ర పోషించిన తనకు డైరీ రాయడమనే అలవాటు ఉందనీ, 'జీవిత చరిత్ర' రాసే ధైర్యం వచ్చినప్పుడు తప్పని సరిగా రాస్తాననీ చెప్పారు. కోటి రూపాయలతో తాను ఏర్పాటు చేసిన సరస్వతీ విద్యాపీఠంలో ఏభై మంది విద్యార్థులు ఉన్నట్టు వివరించారు.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|