దుమ్ము రేపుతున్న 'కిక్'
'అరుంధతి' సంక్రాంతి హిట్ గా డిక్లేర్ అయితే, సమ్మర్ సీజన్ లో సరైన హిట్ గా 'కిక్' దుమ్ము రేపుతోంది. మే 8న విడుదలైన ఈ చిత్రం అప్రతిహతంగా నాలుగవ వారంలోనూ తిరుగులేకుండా దూసుకుపోతుంది. మొదట్నించీ పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రానికి ఆ తర్వాత విడుదలైన చిత్రాలేవీ గట్టి పోటీ ఇవ్వలేకపోవడం కూడా ప్రధాన అడ్వాంటేజ్ అయింది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించారు. ఈ చిత్రం 24 రోజుల్లో 15.49 కోట్ల షేర్ ను రాబట్టడగా, 21.78 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ షేర్ రికార్డు కావడం విశేషం. ఓవర్ సీస్, కర్నాటక, ఒరిస్సా కలెక్షన్లు అదనం.
కలెక్షన్ల వసూళ్ల ప్రకారం రవితేజ సినిమాల్లోనే ఇది బిగ్సెస్ట్ హిట్ గా నిలుస్తోందనీ, ఈ వారంలో వచ్చే సినిమాలు ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తున్నా పెద్ద చిత్రాలేవీ బరిలో లేకపోవడంతో మరో రెండు మూడు వారాల వరకూ 'కిక్' వసూళ్లకు ఢోకా ఉండకపోవచ్చనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'కిక్' చిత్రం సాధించిన విజయంతో వివిధ భాషల్లో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ ఫ్యాన్సీ ఆఫర్ తో దక్కించుకున్నారు. కన్నడంలో సుదీప్ హీరోగా ఈ చిత్రం రీమేక్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|