'మంచి చేయడం కష్టం కానీ చెడెతంసేపని పెద్దలు అంటారు. ప్రతి నాయక పాత్రల కంటే హీరో పాత్ర చేయడమే కష్టంగా ఉంటుంది' అని అజయ్ పేర్కొన్నారు. 'లక్ష్మీకల్యాణం', 'విక్రమార్కుడు' వంటి పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా ప్రేక్షకులను మెప్పించిన అజయ్ తొలిసారి 'ఆ ఒక్కడు' చిత్రంలో హీరోగా మారి ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. టాలీ 2 హాలీ ఫిలిమ్స్ పతాకంపై ఎన్.ఎస్.మూర్తి దర్శకత్వంలో ఇందుకూరి గణపతిరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అజయ్ తో జరిపిన మాటామంతీ...
? విలన్ నుంచి హీరోగా మారిన ఎక్స్ పీరియన్స్
- ఇప్పటివరకూ నెగిటివ్ పాత్రలు చేసిన నాకు తొలిసారి పాజిటివ్ పాత్ర చేయడం కష్టంగానే అనిపించింది. నెగిటివ్ పాత్రకు 20 నిమిషాల నిడివి ఉంటే హీరో అంటే 2.15 గంటల వ్యవధితో సాగుతుంది. అందులోనూ హీరో పాత్రల్లో విభిన్నమైన ఫీలింగ్స్ చూపాల్సి ఉంటుంది. రొమాంటిక్ అంశాలూ ఉంటాయి. ఆ విషయంలో కొంచెం కొత్తగానే అనిపించింది. డాన్స్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. అప్పట్లో మధు ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో డాన్స్ విషయంలో తీసుకున్న శిక్షణ ఇప్పుడు ఉపయోగపడింది.
?చిత్ర కథాంశం
-సహజత్వానికి దగ్గరగా ఉండే రఫ్ పాత్ర నాది. కథాబలంతో పాటు కమర్షియల్ హంగులన్నీ సినిమాలో ఉన్నాయి. ఒక సమస్య చుట్టూ తిరిగే కథలో కుటుంబంలోని భావోద్వాగాలూ ఇందులో కనిపిస్తాయి. హీరో పాత్రకు అన్నివిధాలా న్యాయం చేశాననే భావిస్తున్నాను.