హీరోకే కష్టం ఎక్కువః అజయ్
?'ఆ ఒక్కడు'లోని ప్రత్యేకతలు
- చాలానే చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు మూర్తి చక్కగా మలిచారు. మణిశర్మ సంగీతం, రీరికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుంది. కమలాకర్ ఛాయాగ్రహణం మరో హైలైట్. హీరోగా నటించిన తొలి చిత్రానికే నిర్మాతలు చక్కటి ప్రమోషన్ కల్పించారు. సురేష్ గోపి, నాజర్ పాత్రలు కూడా కీలకమైనవే. సురేష్ గోపి క్రిమినల్ లాయర్ గా నటిస్తే, నేను ఆయన అసిస్టెంట్ ని. నూతన కథానాయిక మధురిమ గ్లామర్, నటన కూడా చిత్రానికి ఆకర్షణ తెచ్చిపెడుతుంది.
?విలనీ పాత్రలు కంటిన్యూ చేస్తారా
- అజయ్ హీరో అయిపోయాడు కదా...ఇక విలన్ పాత్రలు చేయడని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ప్రస్తుతం చేస్తున్న 'ఆర్య-2', 'యాగం', 'సైయాట' చిత్రాల్లోనూ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు పోషించాను. పాత్ర బాగుంటే అది నెగిటివ్ పాత్రా, లేక హీరోనా అనేది చూడను. దేనికైనా రెడీ.
?'సారాయి వీర్రాజు' ఎంతవరకూ వచ్చింది
- 'ఆ ఒక్కడు' తర్వాత హీరోగా నటిస్తున్న చిత్రమిది. కన్నణ్ దర్శకత్వంలో విశాలాక్షి క్రియేషన్స్ పతాకంపై రావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం70 శాతం పూర్తయింది. మరో 20 రోజుల షూటింగ్ తో సినిమా పూర్తవుతుంది. జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. హీరోగా మరికొన్న ఆఫర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|