చిక్కుల్లో సుహాసిని మణిరత్నం
సీనియర్ నటి సుహాసినిపై తమిళ దర్శకనిర్మాత శక్తి చిదంబరం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెపే కేసు వేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. లారెన్స్ కథానాయకుడుగా ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన 'రాజాధి రాజా' సినిమాను 'బ్యాడ్ టేస్ట్' తో తీశారంటూ సుహాసిని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.
సుహానిసి తమిళంలో ఓ ఛానల్ కోసం 'హాసిని పేసుమ్ పడమ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలపై నిర్మొహమాటంగా ఇందులో విశ్లేషిస్తుంటారు. ఇందులో భాగంగానే 'రాజాధి రాజా' గురించి సుహాసిని వ్యాఖ్యానిస్తూ, ఎమ్జీఆర్, రజనీ, విజయ్ చిత్రాల ఫార్ములాలో ఈ సినిమా ఉందనీ, తమిళ సినిమాను ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టిందనీ అన్నారు. దీంతో శక్తిచిదంబరం భగ్గుమంటున్నారు. తన సినిమాతో తమిళ ఇండస్ట్రీ 20 ఏళ్ల వెనక్కి వెళితే సుహాసిని భర్త మణిరత్నం తీస్తున్న 'రావణ' 2000 ఏళ్ల క్రితం నాటిది కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మణిరత్నం గత సినిమాలు కూడా కర్ణ, సావిత్రి-సత్యవంతుడు వంటి చారిత్రక కథా వస్తువుల ఆధారంగా తీసినవేనని అంటున్నారు. సుహాసినిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటం చేసేందుకు కూడా ఆయన ప్రస్తుతం సిద్ధపడుతున్నారు.
Be first to comment on this News / Article!
|