వెంట్రిలాక్విస్ట్ గా వెంకటేష్
పెళ్లికాని ప్రసాద్ గా, చింతకాయరవిగా ఎప్పటికప్పుడు విలక్షణ భూమికలు ఎంచుకుని వరుస సక్సెస్ లు సాధిస్తున్న విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. వరుసగా మూడు హిట్లతో హ్యాట్రిక్ సాధించిన శ్రీనువైట్ల దర్శకత్వంలో వెంకటేష్ కొత్త చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. దీనికి 'నమో వెంకటేశా' అనే టైటిల్ ను కూడా నిశ్చయించారు. ఈ చిత్రంలో వెంట్రిలాక్విస్ట్ గా వెంకటేష్ నటించబోతున్నట్టు సమాచారం. సహజంగానే ఈ తరహా పాత్రలో బోలెడంత ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ కు కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండింట్లోనూ వెంకటేష్ కు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని శ్రీనువైట్ల ఈ కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది.
వెంకటేష్ చిత్రాల్లోనే హెవీ బడ్జెట్ చిత్రంగా ఇది రూపొందనుందనీ, డి.సురేష్ బాబుతో పాటు శ్రీనువైట్ల, మరో ఇద్దరు కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటారని సినీ వర్గాల భోగట్టా. ఈ చిత్రంలోని ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్ కు జోడిగా 'ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే' చిత్రం తర్వాత మరోసారి త్రిష నటించబోతోంది. ఈనెల 18న ఈ చిత్రానికి ముహూర్తం నిశ్చయించినట్టు సమాచారం. ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి వెంకటేష్ నటిస్తున్న 'ఈనాడు' చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. బాలీవుడ్ హిట్ 'ఎ వెన్స్ డే'కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
Be first to comment on this News / Article!
|