సిద్దార్ధ 'ఓయ్' 25న
సిద్దార్ధ, షామిలి (హీరోయిన్ గా తొలి పరిచయం) జంటగా యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'ఓయ్'. ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో రెండు పాటలు చిత్రీకరించిన యూనిట్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంది.
నిర్మాత దానయ్య ఆ విశేషాలను తెలియజేస్తూ, సిద్దార్ధ-షామిలీ జంట తొలిసారి నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నామని చెప్పారు. మే 25 నుంచి ఈనెల 2వ తేదీ వరకూ ఆస్ట్రేలియాలో రెండు పాటలు చిత్రీకరించినట్టు చెప్పారు. రాజు సుందరం నృత్య సారథ్యంలో ఈ పాటల చిత్రీకరణ జరిగిందన్నారు. మరో పాట మిగిలి ఉందనీ, ఈనెల 12 నుంచి చెన్నైలో చిత్రీకరణ జరుపుతామని అన్నారు. మరోవైపు రీరికార్డింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చాయని చెప్పారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ, ఈనెల 25న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ తెలిపారు.
Be first to comment on this News / Article!
|