ఆకాష్ 'స్వీట్ హార్ట్ ' 19న
శ్రీనువైట్ల 'ఆనందం' సినిమాతో అప్పట్లో హీరోగా బిజీ అయిన ఆకాష్ ఆ తర్వాత మళ్లీ హిట్ లేని పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. అందం, అభినయం అన్నీ ఉన్నా మంచి ఇతివృత్తాల ఎంపికలో ఆయన వెనకబడ్డారు. దీంతో ఆయన హీరోగా నటిస్తూ తొలిసారి 'స్వీట్ హార్ట్' చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆకాష్, డైసీ బొప్పన్న, సుహాసిని ాయకా నాయికలుగా దేవీ మూవీస్ పతాకంపై ఎస్.జె.రత్నాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమా క్వాలిటీ బాగుండాలనే ఉద్దేశంతో సిజి వర్క్ చేయడంతో విడుదలలో కొద్దిపాటి జాప్యం జరిగిందనీ, సినిమా చాలా బాగా వచ్చిందనీ ఆకాష్ తెలిపారు. తొలి కాపీ చూసిన వారంతా మరో 'ఆనంద్'లా ఈ చిత్రం ఉందని అనడం తమ అంచనాలను మరింత పెంచిందన్నారు. నిజానికి 'ఆనంద్' తర్వాత మంచి దర్శకుల చేతిలో పడలేదనే అభిప్రాయం తనకుందనీ, అందుకోసమే ఈసారి నన్ను నేను నిరూపించుకునేందుకు దర్శకుడిగా మారానని ఆయన చెప్పారు. సీతను రాముడు అనుమానించినప్పుడు ఆమె అగ్నిప్రవేశం చేసిన తరహాలోనే ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలు ఉంటాయన్నారు. ఇందులోని భావోద్యాగమైన సన్నివేశాలను సెన్సార్ సభ్యులను కూడా కదలించినట్టు చెప్పారు. నిర్మాత రత్నావత్ మాట్లాడుతూ, ఆకాష్ ఈ కథ చెప్పిన తీరు నచ్చి ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించామనీ, చాలా చక్కగా తన బాధ్యతను నెరవేర్చాడనీ చెప్పారు. గ్రాఫిక్స్ కోసం విడుదలలో కొద్దిపాటి జాప్యం జరిగినా సినిమా చాలా బాగావచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి నందన్ రాజ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|