వెంకీతో అమ్మ రాజశేఖరా?
ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ 'రణం' వంటి సక్సెస్ ఫుల్ మూవీతో అప్పట్లో దర్శకుడిగా కూడా మారారు. ఆ చిత్రం తర్వాత దర్శకుడిగా పలు మంచి ఆఫర్లు లభించినప్పటికీ మళ్లీ సక్సెస్ దక్కలేదు. రవితేజతో 'ఖరత్నాక్', నితిన్ తో 'టక్కరి' చిత్రాలు ఫ్లాపులబారిన పడ్డాయి. తన సోదరుడిని హీరోగా పరిచయం చేస్తూ ఇటీవల తీసిన 'బీభత్సం' సోదిలోకి లేకుండా పోయింది. దీంతో ఇక అమ్మ రాజశేఖర్ పని అయిపోయిందనుకున్న వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోక తప్పడం లేదు. స్టార్ హీరో వెంకటేష్ తో ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. వెంకటేష్ తో 'లక్ష్మి' వంటి హిట్ చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ తాజా కాంబినేషన్ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలు హిట్ చిత్రాలకు రచన చేసిన కోన వెంకట్ స్క్రిప్టు రచన చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చురుకుగా జరుగుతోంది. వెంకటష్ ఇటీవలే కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్న 'ఈనాడు' చిత్రంలో తన పోర్షన్ ను పూర్తి చేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తదుపరి చిత్రానికి కమిట్ అయ్యారు. త్రిష కథానాయిక. డి.సురేష్ బాబు, శ్రీనువైట్ల మరో ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మించనున్న ఈ చిత్రం జూలై మొదటివారంలో సెట్స్ పైకి రాబోతోంది. అమ్మరాజశేఖర్ కాంబినేషన్ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|