'స్టైల్' మార్చాః రాజశేఖర్
యాంగ్రీ యంగ్ మన్ పాత్రలు హీరో రాజశేఖర్ కు కొట్టిన పిండి. పోలీసు పాత్రల్లో ఎంత ఫోర్స్ గా కనిపిస్తారో, సెంటిమెంట్ పాత్రల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను అంతంగా కదిలిస్తారు. ఇటీవల 'ఎవడైతే నాకేంటి'తో యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులను, 'గోరింటాకు'తో సెంటిమెంట్ ఇష్టపడే ప్రేక్షకులనూ అలరించి రెండు హిట్లు దక్కించుకున్నారు. తాజాగా ఆయన పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'నా స్టైలే వేరు' చిత్రంతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నారు. పాతికేళ్లుగా తాను చేయని లాయర్ పాత్రను ఇందులో పోషించాననీ, కొత్త రాజశేఖర్ ఈ చిత్రంలో కనిపిస్తాడనీ ఆయన చెబుతున్నారు. రాంప్రసాద్ దర్శకత్వంలో దిసిర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాగంటి గోపీనాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజశేఖర్ కు జోడిగా భూమిక నటించడం కూడా ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ తో జరిగిన ముఖాముఖీ..
?'నా స్టైలే వేరు' ఎలా ఉండబోతోంది...టార్గెట్ ఆడియెన్స్ ఎవరు
-పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. మలయాళంలో విజయవంతమైన 'హలో' చిత్రం దీనికి మాతృక. ప్రధానంగా రెండు కుటుంబాల మధ్య సాగే కథ ఇది. నేను నటించిన 'అంకుశం', 'ఆగ్రహం', 'మగాడు' చిత్రాల మాదిరిగా కాకుండా పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. నవరసాలు ఈ చిత్రంలో ఉంటాయి. కొత్త రాజశేఖర్ ను తప్పనిసరిగా చూస్తారు. మొదట్లో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అనుకున్నప్పటికీ పూర్తయిన తర్వాత చూస్తే చాలా మంచి సినిమా అవుతుందని అనిపించింది. ఆమధ్యన 'గోరింటాకు' సినిమా చేసినప్పుడు మహిళా ప్రేక్షకులనే ఆకట్టుకుందని అనుకున్నప్పటికీ మగవాళ్లను కూడా అలరించింది. 'నా స్టైలే వేరు' తప్పనిసరిగా కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాలనూ అలరిస్తుందనే నమ్మకం ఉంది.
?ఒక ఏరియాకి సినిమా రిలీజ్ చేస్తున్నారని తెలిసింది
-నిజమే. సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాత మాగంటి గోపీనాథ్ సొంతంగా ఆంధ్రలో రిలీజ్ చేస్తున్నారు. నేను సీడెడ్ లో సురేష్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాను.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|