'స్టైల్' మార్చాః రాజశేఖర్
?'నా స్టైలే వేరు'లో మీ పాత్ర ఎలా ఉంటుంది
-పాతికేళ్లుగా నేను చేయని పాత్రను ఇందులో పోషించాను. లాయర్ గా నటించాను. మొదట్లో లాయర్ ప్రాక్టీస్ ఉండదు. సమస్యలో ఉన్న
కథానాయిక నన్ను కలుస్తుంది. అప్పుడు నేను కూడా కొన్ని సమస్యల్లో ఉంటాను. ఈ క్రమంలోనే లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెడతాను. ఆ తర్వాత ఏమటనేది తెరపై చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది.
?భూమిక ఎంపిక వెనుక...
-భూమిక మంచి టాలెండెంట్ ఆర్టిస్టు. ఇందులో ఆమె చాలా సున్నిత మనస్కురాలిగా అభినయించింది. మా ఇద్దరి మధ్యా ప్రేమ అంశం ఎలా ఉంటుందనేది చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మధ్య నేను నటించిన కొన్ని సినిమాలకు హీరోయిన్ మైనస్ అయింది. అందువల్ల అనుకున్నంతగా సినిమాలు ఆడలేదు. ఇప్పుడు భూమికను తీసుకున్నాం. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
?సాంకేతిక అంశాల గురించి..
-నిర్మాత గోపీనాథ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. జపాన్ ఎక్స్ పో నుంచి ఓ ఖరీదైన కారును తెప్పించారు. ఇప్పుడు కారు కాంటెస్ట్ కూడా పెట్టాం. సినిమా రిలీజ్ తర్వాత లక్కీ డ్రా తీసి విజేతకు కారు అందజేస్తాం. అలాగే అనూప్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రఘు అనే కొత్త డాన్స్ మాస్టర్ నాపై చక్కటి నృత్యరీతులను కంపోజ్ చేశారు. అరుణ్ ఫోటోగ్రఫీ, సతీష్ ఫైట్స్ బాగుంటాయి. మలయాళ మాతృకతో పోలిస్తే తక్కువ మార్పులతోనే రచయితలు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
?తదుపరి సినిమాలు
-ఒక రీమేక్, మరో స్ట్రయిట్ ఫిల్మ్ అనుకుంటున్నాం. పలువురు దర్శకులు చెపపిన 30కి పైగా కథలు విన్నాను. మరో 10 రీమేక్ సినిమాలు చేశాను.వాటిల్లోంచి ఒక్కో సినిమా చేయాలనుకుటున్నాను. మరో వారంలో ఆ వివరాలు వెల్లడిస్తాను.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|