'బోణి' రివ్యూ
సినిమా అనేది ప్రధానంగా వాణిజ్య ప్రయోజనాలను ఆశించే మాధ్యమమే అయినా ప్రతి కథ కచ్చితంగా ఏదో ఒక కీలకమైన పాయింట్ మీదే నడుస్తుంటుంది. ఆ పాయింట్ అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినప్పటికీ దానిని కొత్తగా చెప్పగలగినప్పుడే దర్శకుడి పనితనం రుజువవుతుంది. సహజంగా ఇవాల్టి యువ దర్శకులే కథకులు కూడా కావడంతో తమకు తెలిసింది పదిమందితో పంచుకోవాలనిపించడం సహజం. వీరిలో సందేశం ఇవ్వాలనే దృక్కోణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎన్ఆర్ఐ ఔత్సాహికులలో (సినీరంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారు) ఈ కోణం ఒకింత ఎక్కువే. 'ఏ పని చేసినా అందువల్ల నాకేమి ఒరుగుతుందని అనుకోకుండా నిస్వార్థంగా ఆలోచించగలిగితే ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది' అనే కాన్సెప్ట్ నిస్సందేహంగా గొప్పదే. డబ్బుతో కలగని తృప్తి నిస్వార్థ సేవతో కలుగుతుంది. బాధితుల కళ్లలో సంతోషం తొణికిసలాడినప్పుడు అంతవరకూ మనం పడిన కష్టం దూదిపింజలా ఎగిరిపోతుంది. ఆ తృప్తి ముందు ఎన్ని కోట్లైనా బలాదూరే. 'బోణి' స్టోరీలైన్ ఇదే. తొలిసారి చేపట్టే పనిని కానీ, ఆ పని నుంచి తొలిసారి వచ్చిన ప్రయోజనాన్ని గానీ 'బోణి' అని పిలుస్తుంటాం. యాదృచ్ఛికంగా 'బోణి' టీమ్ లోని చాలా మందికి ఇదే మొదటి బోణి కూడా. సంగీత దర్శకుడు రమణ గోగుల తొలిసారి నిర్మాతగా మారి గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్ఆర్ఐ యువకుడు రాజ్ పిప్పళ్ల పలు యాడ్ ఫిల్మ్స్ చేసిన అనుభవంతో తొలిసారి ఈ చిత్రంతో బోణి చేశారు. క్రితి కర్బందా హీరోయిన్ గా తొలిసారి పరిచయమైంది. ఇక సుమంత్ కు ఇది బోణి కాకపోయినా, సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయన కూడా మళ్లీ ఓ హిట్ 'బోణి' అవసరమే. ఇందరి టీమ్ వర్క్ ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేలా ఉందా అనేది ఓసారి చూద్దాం.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|