'బోణి' రివ్యూ
డిడి (సుమంత్), చిన్నా (త్రినేత్రుడు) బాల్యస్నేహితులు. చిన్నప్పుడు అనాథాశ్రయంలో పెరుగుతారు. వారిని కన్నబిడ్డల్లాగా చూసే ఆయా సరస్వతమ్మకు (సుధ) ఎప్పటికైనా పులిహోర సెంటర్ పెట్టాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరకుండానే ఆమె కన్ను మూస్తుంది. సరస్వతమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతోనే డిడి, చిన్నా పెరిగి పెద్దవారవుతారు. అందుకు అవసరమైన డబ్బు కోసం గిరన్న (తనికెళ్ల భరణి) అనే ఓ చోటా డాన్ దగ్గర ఇద్దరూ చేరి హఫ్తా వసూళ్లు చేస్తుంటారు. ఆ క్రమంలోనే గిరన్న డిడిని దాసన్న (జయప్రకాష్ రెడ్డి) అనే మరో డాన్ దగ్గర పనికి పెడతాడు. డిడికి దాసన్న'బోణి'గా ఓ కిడ్నాప్ పని అప్పగిస్తాడు. ఆ ప్రకారమే వ్యవసాయ శాఖ మంత్రి (ఆహుతి ప్రసాద్) కూతురైన ప్రగతి (క్రితి)ని డిడి కిడ్నాప్ చేస్తాడు. అయితే ఆ కిడ్నాప్ అంతా తనకు తెలిసి జరిగినట్టుగానే ప్రగతి ప్రవర్తించడం డిడిని అయోమయంలో పడేస్తుంది. అసలు ప్రగతి కిడ్నాప్ కావాలని ఎందుకు అనుకుంది? ఆమె ఆశయం ఏమిటి? దాసన్న ఆమెను కిడ్నాప్ చేయాలనుకోవడం వెనుక కారకులెవరు? పులిహోర సెంటర్ కు అవసరమైన డబ్బులు కోసమే కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న డిడి ఆ తర్వాత ప్రగతికి ఎందుకు సహకరించాడు అనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|