'బోణి' రివ్యూ
హీరోయిన్ ఆశయానికీ, హీరో లక్ష్యానికీ కిడ్నాప్ డ్రామా ముడిపెట్టడం ద్వారా 'బోణి' కథను రాజ్ పిప్పళ్ల అల్లుకున్నారు. హీరోయిన్ లక్ష్యం ఉన్నతమైనదనుకున్నా...హీరో ఆశయం పులిహోర సెంటర్ పెట్టడం అన్నది అంతగా మింగుడు కాని వ్యవహారం. ఎందుకంటే ఇందుకు ఏడెనిమిది లక్షలు కావాలని హీరో నోట చెప్పిస్తారు. అంత బడ్జెట్ అవసరమా? పోనీ హీరో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం చూద్దామా అంటే కేరాఫ్ అనాథాశ్రయం. బడ్జెట్ సరిపోదనుకున్నప్పుడు కాకా హోటల్ నడపొచ్చు. ఇందుకోసం హప్తా, భూకబ్జాలు చేసే ముఠాల్లో పనిచేయనక్కరలేదు. చివర్లో కిడ్నాప్ సూత్రధారి ఎవరనే ట్విస్ట్ మినహాయిస్తే ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ క్లైమాక్స్ ఫార్మెట్ నే దర్శకుడు ఎంచుకోవడం చూస్తే కొత్తదనాన్ని ఏవిధంగా ఆ(శ్వా)పాదించగలం?
సుమంత్ పాత్రలో పలు డైమన్షన్లు ఉన్నాయి. వృత్తిపరంగా మాస్, ఆలోచనా పరంగా క్లాస్. బ్యాలెన్సెడ్ గా సుమంత్ తన పాత్రను పోషించారు. సెంటిమెంట్ అంశాల్లో డెప్త్ పెంచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఫైట్లు, డాన్స్ లు సునాయాసంగా చేశారు. క్రితి గ్లామర్ తో అలరించింది. నటనపరంగా కూడా ఫరవాలేదు. త్రినేత్రుడు మంచి ఈజ్ తో నటించాడు. తనికెళ్ల భరణి తన సీనియారిటీ తో దాదా పాత్రను రక్తి కట్టించారు. జయప్రకాష్ రెడ్డి రొటీన్ విలనీతో అడపాదడపా నవ్వించారు. ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్ పాత్రల పరిధి తక్కువ. అండర్ కవర్ కాప్స్ గా సత్యం రాజేష్, సీనియర్ నరేష్ అడపాదడపా నవ్వించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|