'బోణి' రివ్యూ
రమణగోగుల సంగీతం అందించిన పాటల్లో 'అరెరె చేజారిందా' వంటి ఒకటి రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సంభాషణల్లో పదును లేదు. 'డీడీగాడి లవర్ పడుకునే దీపికలా ఉంది' తరహా సంభాషణల వల్ల కిక్ ఉండదు కదా. ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఎక్కువ స్కోరింగ్ చేసింది. ముఖ్యంగా సాంగ్ సీక్వెన్స్ లో లొకేషన్ల ఆందాలను బాగా తెరకెక్కించారు. రామ్ లక్ష్మణ్- విజయ్ కంపోజ్ చేసిన ఫైట్స్ డల్ గా ఉన్నాయి. కొన్ని పైట్స్ క్లోజ్ లో, మరికొన్ని స్లో మోషన్ లో కంపోజ్ చేశారు. రమణగోగుల నిర్మాణ విలువలు తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం రొటీన్ తరహాలో సాగితే, ద్వితీయార్థంలో కొద్దిసేపు కథలో వేగం కనిపించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచినా ఆ తర్వాత రొటీన్ ఫార్ములాతో నడక సాగించింది. సాంకేతిక విలువలు, కొన్ని డీసెంట్ సాంగ్స్ ఆకట్టుకునే అంశాలైతే, ఎంచుకున్న కథాంశాన్ని అర్ధవంతంగా తెరకెక్కించడంలో తగినంత ఎనర్జీ లోపించడం నిరాశపరచే అంశాలు. ఓవరాల్ గా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఇది సరైన 'బోణి' కావడం కష్టం...

Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|