'నా స్టైలే వేరు' రివ్యూ
దర్శకుడు రామ్ ప్రసాద్ పలు ట్విస్ట్ లతో సస్పెన్స్ ప్రధానంగా కథను నడిపించే ప్రయత్నం చేశారు. కొంత కామెడీ కోటింగ్ ఇచ్చారు. అయితే నిడివి తగ్గించి, కామెడీ వైపు మరింత ఫోకస్ చేసి ఉంటే తగినంత క్రిస్ప్ వచ్చేది. అలాగే క్లైమాక్స్ లో మిస్టరీని రివీల్ చేసే ఘట్టం మరీ లెంగ్తీ గా ఉంది. హీరో లాయర్ అయినప్పటికీ ఒక్కసారి కూడా నల్లకోటు వేసుకోవడం కానీ కోర్టుకు వెళ్లనట్టు గానీ చూపించకపోవడం 'స్టైల్'లో భాగమే కావచ్చు. శివరామ్ పై వ్యక్తిగత పగ పెంచుకునే విలన్ పాత్ర లేకపోయినా కథాంశానికి వచ్చే లేటు ఉండదు. నిడివి కూడా తగ్గుండేది.
రాజశేఖర్ నటన కంటే ఆయన ఫిట్ నెస్ మెయింటెనెన్స్ ను మెచ్చుకుని తీరాలి. తాగుబోతుగా కనిపించినా అందమైన దుస్తులు, చెక్కుచెదరని క్రాఫ్ తో మిసమిసలాడిపోయారు. అది కూడా స్టైల్ లో భాగమే కాబోలు. ఈసారి డాన్స్ లలో కూడా ఫరవాలేదనిపించుకుంటారు. కామెడీ పండించడానికి మాత్రం మరింత కష్టపడక తప్పదు. భూమిక తన పాత్రకు న్యాయం చేసింది. పాటల్లో మంచి గ్లామర్ తో ఆకట్టుకుంది. విజయ్ కుమార్, అన్నపూర్ణ వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా చేయడానికి పెద్దగా ఏమీ లేదంటూ బ్లాంక్ ఫేస్ లతో కనిపించారు. బ్రహ్మానందం, అతని మూడో భార్య మధ్య నడిచే 'భూతం' సన్నివేశాలు అడపాదడపా నవ్వించాయి. అయితే కామెడియన్లలో ఆలీ ఎక్కువ స్కోరింగ్ చేశాడు. ఒంటికాలితో పరిగెడుతూ రౌడీలకు చిక్కకుండా తప్పించుకునే సన్నివేశాలు బాగా పండాయి. చోటా మోటా విలన్ల పాత్రలన్నీ అంతంత మాత్రమే.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|