'నా స్టైలే వేరు' రివ్యూ
సాంకేతక పరంగా చూసినప్పుడు సంభాషణల రచయిత కోన వెంకట్ అంటే నమ్మబుద్ధి కాదు. అంత డల్ గా ఆయన సంభాషణలు రాశారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన గీతాల్లో ఏ ఒక్కటీ గుర్తించుకునే స్థాయిలో కనిపించవు. ఎస్.అరుణ్ కుమార్ ఫోటోగ్రఫీ పనితనం పాటల్లోనే కనిపిస్తుంది. కాస్టూమ్, కళాదర్శకత్వ విభాగాలు బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉండాల్సింది.
సినిమా ప్రథమార్థం సాదాసీదాగా నడక సాగిస్తే, ద్వితీయార్థంలో అసందర్భంగా తోచే కామెడీ కథలోని థ్రిల్ కు అడ్డుపడుతుంది. కామెడీపై మరంత పట్టు సాధించి..సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా దర్శకుడు హ్యాండిల్ చేసుంటే బెటర్ రిజల్ట్ వచ్చుండేదే. అలాకాకపోవడంతో టైటిల్ కే 'స్టైలే' పరిమితమవుతుంది. మౌత్ పబ్లిసిటీ తోడైతే కొంతైనా సినిమాకి ఆక్సిజన్ అందొచ్చు. అంతే..
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|