'నా స్టైలే వేరు' రివ్యూ
నవరసాల్లో అందరూ ఇష్టపడేది హాస్యరసం. ఎంత సీరియస్ సినిమా అయినా కామెడీ లేకపోతే పండదు. అందుకే కమెడియన్లకు అంత డిమాండ్. కమెడియన్లు కథానాయకులుగా మారుతుంటే...స్టార్ హీరోలు వీలు చిక్కితే పూర్తి స్థాయి కామెడీ పాత్రల్లోకి పరకాయప్రవేశం చేయాలని తహతహలాడుతున్నారు. నిజానికి నటుడు అన్న తర్వాత నవరసాలూ పండించాల్సిందే. కథ డిమాండ్ ను బట్టి అన్ని రసాల్లోనూప్రూవ్ చేసుకోవాల్సిందే. పోలీసు పాత్రలు, సెంటిమెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న యాంగ్రీ మాన్ రాజశేఖర్ ఇప్పుడు వాటికి భిన్నంగా 'కామెడీ' వైపు మళ్లే ప్రయత్నం చేయడం వల్లనో ఏమో కానీ 'నా స్టైలే వేరు' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టైల్ మాట అటుంచితే...రాజశేఖర్ ను ఒకందుకు మెచ్చుకోవాలి. రీమేక్ అని చెప్పుకోవడానికి నామోషి అనిపించి మక్కీకి మక్కీ హాలీవుడ్ చిత్రాలను కాపీ కొట్టేసి కనీసం కర్టెసీ కూడా ఇవ్వకుండా తమ సొంత కథంటూ డబ్బా కొట్టుకునే చాలామంది ఫిల్మ్ మేకర్స్ కంటే ఆయన బెటర్. రీమేక్ అని చెప్పుకునేందుకు వెనుకాడరు. 'నా స్టైలే వేరు' చిత్రానికి మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'హలో' చిత్రం మాతృక అని ఆయన ప్రకటించుకున్నారు. నిజానికి 'హలో' చిత్రం హాలీవుడ్ 'సెల్యులార్'కు కాపీ. ఆపదల్లో ఉన్న ఓ అమ్మాయి పగిలిపోయిన ఫోన్ నుంచి అపరిచితుడైన ఓ వ్యక్తికి కాల్ చేసి అతని సాయం పొందడమనే పాయింట్ ఆధారంగా 'సెల్యులార్' రూపొందింది. కొద్ది పాటి మార్పులు చేర్పులతో 'నా స్టైలే వేరు' చిత్రాన్ని దర్శకుడు జి.రామ్ ప్రసాద్ తెరకెక్కించారు. రాజశేఖర్ జోడిగా బ్యూటీ క్వీన్ భూమికను జత చేశారు. రాజశేఖర్ స్టైల్ ఏమాత్రం విభిన్నంగా ఉందనేది చూద్దాం...
శివరామ్ (రాజశేఖర్) ఓ లాయర్. తను ప్రేమించిన అమ్మాయి మరణానికి తన తల్లిదండ్రులే పరోక్షంగా కారణమయ్యారనే బాధతో వారిని లెక్కచేయకుండా తిరుగుతుంటాడు. వృత్తిని విడిచిపెట్టి తాగుడుకు దగ్గరవుతాడు. ఒకరోజు ఆపాదలో ఉన్న తనను కాపాడమంటూ ఓ అమ్మాయి నుంచి అతనికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ అమ్మాయి పేరు పార్వతి (భూమిక). ఆమె విశ్వనాథ్ (విజయ్ కుమార్) అనే కోటీశ్వరుడి కూతురు. విశ్వనాథ్ ఓ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తాడు. ఇదే అదనుగా అతని బంధుగణమంతా పార్వతి ఆస్తిపై కన్నేస్తారు. ఆమెను అడ్డు తొలగిస్తే ఆ ఆస్తి తమ పరం అవుతుందని ఎవరికి వారు ప్లాన్ చేస్తుంటారు. ఆమెను కిడ్నాప్ చేసి ఓ గదిలో పడేస్తారు. ఫోన్ కూడా పగలగొట్టేస్తారు. పగిలిన పార్ట్ లను అతకబెట్టిన పార్వతి చేతికి వచ్చిన నెంబర్ డయిల్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ అందుకున్న శివరామ్ ఆమె చెప్పిన గుర్తులతో వెళ్లి కిడ్నాపర్ల చెర నుంచి ఆమెను తప్పించి తన ఇంటికి తీసుకువస్తాడు. తన తండ్రి తిరిగి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్తానని పార్వతి చెబుతుంది. ఆమె జాడ తెలుసుకున్న బంధువులంతా శివరామ్ ఇంటికి వచ్చి వీరంగం చేస్తారు. ఆ తర్వాత చేసేదేమీ లేక వెనుదిరిగిపోతారు. ఈ క్రమంలో విశ్వనాథ్ ఇంట్లో ఇద్దరు హత్యకు గురవుతారు. పార్వతి కిడ్నాప్, ఈ జంట హత్యల వెనుక ఉన్నది ఎవరు? పార్వతికి ఎవర్నించి ప్రాణాపాయం ఉంది? ఆ మిస్టరీని శివరామ్ ఎలా ఛేదించాదనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|