`కిక్' అర్ధ శతదినోత్సవం
రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స పతాకంపై వెంకట్ నిర్మించిన `కిక్' విజయవిహారం చేస్తూ అర్థ శతదినోత్సవానికి చేరువైంది. చిత్ర సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ `అంతర్జాతీయంగా 220 కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాల్లో, జంటనగరాల్లో 18 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ చిత్రం అర్థశతదినోత్సవాన్ని, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని యూనిట్ సభ్యుల సమక్షంలో త్వరలో హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు'. రవితేజ నటించిన గత చిత్రాల కలెక్షన్స్ వసూళ్ళ ప్రకారం ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించదన్నారు. ఈ చిత్రం సంచనల విజయం మంచి `కిక్' ఇవ్వడంతో ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను ఎటిడర్ మోహన్ సొంతం చేసుకోగా, కన్నడం లో ఈచిత్రం రీమేక్ చేసేందుకు పలువురు పోటీపడుతున్నారు.
Be first to comment on this News / Article!
|