3న వస్తున్న `ఓయ్'
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథను అందంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న చిత్రం `ఓయ్'. అండీ అనే పిలుపుతో ప్రారంభమై క్రమేపీ నువ్వుగా రూపాతరం చెంది తుదకు ఓయ్ గా ఎలా పరిణితి చెందింది అనేదే ఈ చిత్ర కథాంశం. సిద్ధార్థ , షామిలి జంటగా ఆనంద్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ పాటను చైన్నైలో చిత్రీకరిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఆడియోకి మంచి స్పందన వస్తోందన్నారు. కాగా ఈనెల 25న సినిమా విడదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపినా కొన్ని కారణాంతరాల వల్ల జూలై 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. నెపోలియన్, సునీల్, ఆలీ, ప్రదీప్ రావత్, సురేఖావాణి తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా, దర్శకత్వం డీవీవీ దానయ్య.
Be first to comment on this News / Article!
|