`నా స్టైలే వేరు' ఏమందంటే
రాజశేఖర్, అందాల నటి భూమిక జంటగా దిసిర ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి గోపీనాథ్ రూపొందించిన `నా స్టైలేవేరు' చిత్రం విజయవంతం కావడంతో హైదరాబాద్ లోని మంగళవారం జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసినిమా చూసినవాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారని, మంచి కలెక్షన్లు వస్తున్నాయని, ఇదంతా సమిష్టి కృషివల్లే సాధ్యమైందన్నారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఈ టైటిల్ పెట్టినప్పుడు ఈ కథకు సూటవ్వదేమో ననే సందేహం నాకు కల్గింది. కానీ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అంటున్నారు. టైటిల్ ప్లస్ అవుతుందని అనుకోలేదన్నారు. ఈ సినిమాలో నేను కామెడీ, డాన్స్ బాగా చేశానని అందరూ అంటున్నారు. దీనికి కారకుడు దర్శకుడేనన్నారు. ఈ సినిమా జీవిత పట్టుబట్టి మరీ చేయిందన్నారు. విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. జీవిత మాట్లాడుతూ ఈ సినిమా కుటుంబసమేతంగా చూడతగ్గ చిత్రం కావడంతో రాజశేఖర్ ని నేను ఫోర్స్ చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిప్రకాష్, విజయరంగరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రదీప్ లు మాట్లాడారు.
Be first to comment on this News / Article!
|