'రాజు మహరాజు' రివ్యూ
దర్శకుడు దుర్గా శంకర్ నాథ్ ఎక్కువగా ట్విస్ట్ ల జోలికి వెళ్లకుండానే కథానాయకుడిలో వచ్చిన పరిణతిని నేర్పుగా చూపించగలిగారు. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో పట్టు కనబరచారు. వర్షంలో కూతురు తడిసిపోకుండా గొడుగుపట్టిన తండ్రిని ఆ తర్వాత పాడి కట్టి తీసుకుపోతున్నప్పుడు వర్షంలో తడవకుండా కూతురు గొడుగు పట్టే సన్నివేశం హృద్యంగా ఉంది. అలాగే పసుపు-కుంకుమల ఔన్నత్యాన్ని చెప్పే ఘట్టం ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుటుంది. అయితే జనాలు చూసి చూసి విసుగెత్తిపోయిన రొటీన్ తరహా కామెడీ ట్రాక్ ను ఎంచుకోవడం సబబుగా అనిపించదు. కథ మీద పట్టు బిగుస్తున్న తరుణంలో వచ్చే చివరి డ్యూయెట్ పూర్తిగా అసందర్భం.
శర్వానంద్ ఒక్కో సినిమాకి మంచి పరిణతి సాధిస్తున్నారు. ఎవర్నీ ఖాతరు చేయని వ్యక్తి నుంచి త్యాగానికి సిద్ధమైన యువకుడిగా చక్కటి హావభావాలతో తన పాత్రకు న్యాయం చేశారు. డాన్సులు, పాటల్లో పలు గెటప్స్ లో కనిపించి అలరించారు. సుర్విన్ చావ్లాకు నటించేందుకు అవకాశమున్న పాత్ర దొరికింది. అయితే హావభావాల విషయంలో మెరుగులు దిద్దుకోవాల్సి ఉంది. గ్లామర్ కు పెద్దగా ఆస్కారం లేకపోయింది. సెకెండ్ హీరోయిన్ గా రెండు డ్యూయెట్లు, మరో రెండు సన్నివేశాలకు తషు కౌషిక్ పరమితమైంది. గ్లామర్ పరంగా సుర్విన్ కంటే తషుదే పైచేయి. మోహన్ బాబు హుందాగా తన పాత్రను పోషించారు. ఒకటి రెండు పంచ్ డైలాగ్ లు, మరో ఫైట్ ఆయన ఖాతాలో ఉన్నాయి. రమ్యకృష్ణ చక్కటి అందంతో మంచి నటనాపటిమతో ఆకట్టుకుంటుంది. జయసుధ ఓ చిన్న పాత్రలో నటించారు. డిటెక్టివ్ ఓంరాజు (బ్రహ్మానందం)గా బ్రహ్మానందం అక్కడక్కడా నవ్వించారు. అయితే బ్రహ్మానందం, సునీల్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఏమాత్రం పట్టుగా లేదు. జయప్రకాష్ రెడ్డి విలనీ రాన్రానూ విసుగెత్తుతోంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|