'రాజు మహరాజు' రివ్యూ
సాంకేతికపరంగా జీవన సత్యం సంభాషణలు ఫరవాలేదు. 'కింగ్ అనే వాడు నో పార్కింగ్ లోనూ ఉంటాడు', 'ఎదగడానికి పట్టే టైమ్ దిగడానికి పట్టదు', 'బిడ్డకూ తల్లికీ మధ్య బుణాలండవు...అన్నీ బంధాలే' వంటి సంభాషణలు బాగున్నాయి. రమేష్ సినిమాటోగ్రఫీ పనితనం కనిపిస్తుంది. చక్రి పాటల్లో పాత బాణీలే తొంగిచూస్తాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం విశ్రాంతి ట్విస్ట్ వరకూ సాదాసీదాగానే సాగుతుంది. ద్వితీయార్థంలో సెంటిమెంట్ పాళ్లెక్కువ. హీరోయిన్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో నడుస్తుంది. ఇటీవల కాలంలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో సినిమాలు రాలేదు. ఈ క్రమంలో మెజారిటీ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పిస్తుందా అనేది చూడాల్సి ఉంది. బి,సి, సెంటర్లలోని మహిళా ప్రేక్షుకుల ఆదరణపైనే హోప్స్ ఎక్కువ. అలాగే కామెడీ కనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఫలితం ఆశాజనకంగా ఉండొచ్చు.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|