'ఎవరైనా ఎపుడైనా' 26న
వరుణ్ సందేష్, ప్రియారామన్ జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'ఎవరైనా ఎపుడైనా'. దీనికి 'ప్రేమలో పడొచ్చు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు మార్తాండ్ కె.శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
కాలేజీ పూర్తి చేసుకున్న యువకుడిగా వరుణ్ సందేష్, కళాశాల విద్యార్థినిగా ప్రియారామన్ ఈ చిత్రంలో నటించారు. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి హిట్స్ తర్వాత వరుణ్ సందేశ్ నటించిన చిత్రం కావడంతో సహజంగానే యూత్ లో ఈ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. ఏవియం బ్యానర్ కొద్ది విరామం తర్వాత తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా ఈ అంచనాలను పెంచుతోంది. మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఇటీవల విడుదలై సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాల దృష్ట్యా సుప్రీం మూవీస్, బ్లూ స్కై ఎంటర్ టైన్ మెంట్ కలిసి అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ఆలీ, గిరిబాబు, అను హసన్, రాథాకుమారి, రమాప్రభ తదితరులు నటించారు. మార్తాండ్ శంకర్ కథ, వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|